అసలే ఎండ.. ఆపై ఉపరితల ద్రోణి, ఉక్కపోతతో అల్లాడుతున్న జనం
వేసవి తొలినాళ్లలోనే ఎండలు మండుతున్నాయి. మార్చిలోనే మాడు పగులుతుంది. ఇటు తుఫాన్ వల్ల వేడితో ఉక్కపోత తప్పడం లేదు. తూర్పు విదర్భ, పరిసర ప్రాంతాల నుంచి తెలంగాణ మీదుగా దక్షిణ తమిళనాడు వరకు సముద్రమట్టానికి సుమారు 0.9 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ద్రోణి ఏర్పడిందని హైదారాబాద్ లోని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. దీని ప్రభావం వలన రాష్ట్రంలో ఆది, సోమవారాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.
రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, వనపర్తి, జోగులాంబ గద్వాల జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉన్నట్టు పేర్కొంది. అల్పపీడనం వాయుగుండంగా మారి, సోమవారం తుఫానుగా మారే అవకాశం ఉందన్నారు. దాదాపు ఉత్తర-ఈశాన్య దిశగా కదులుతూ మార్చి 22వతేదీన బంగ్లాదేశ్-ఉత్తర మయన్మార్ తీరాలకు చేరుకునే అవకాశం ఉందని అధికారులు చెప్పారు. దీని ప్రభావంతో ఏపీలోని కొన్ని ప్రాంతాల్లో దక్షిణ దిశ గాలులు వీస్తున్నాయని వాతావరణ కేంద్రం తెలిపింది.

వచ్చే 3 రోజుల్లో ఉత్తర కోస్తాంధ్ర, యానాం ప్రాంతాల్లో వాతావరణం పొడిగా ఉండే అవకాశం ఉంది. కొన్ని చోట్ల తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. ఆది, సోమవారాల్లో తేలికపాటి వర్షాలు లేదా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. దక్షిణ కోస్తా ఆంధ్రలో వాతావరణం పొడిగా ఉండి... ఒకటి లేదా రెండు చోట్ల తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. రాయలసీమలో వాతావరణం పొడిగా ఉంది. ఒకటి రెండు చోట్ల తేలికపాటి వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు.
వేడికితోడు.. అలపీడనం కలిసింది. దీంతో ఉక్కపోత మాములుగా ఉండటం లేదు. అవును దాంతో జనం అల్లాడిపోతున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు చల్లని చెట్లమాటున ఉంటున్నారు.












Click it and Unblock the Notifications