ట్రెండింగ్ లోనే కాదు... అదరగొట్టేసిన స్టాక్స్
వారాన్ని భారత ఈక్విటీ మార్కెట్లు మంచి లాభాలతో ప్రారంభించాయి. కీలక రంగాల్లో కొనుగోళ్లు సాగడంతో ఇవన్నీ భారీ లాభాలను కళ్లచూశాయి. మీడియా స్టాక్స్ వరుసగా ఏడో సెషన్‌లో కూడా లాభాలబాటలోనే పయనిస్తున్నాయి. 350 పాయింట్ల లాభంతో 62 వేల 883 మార్క్ వద్ద బీఎస్ఈ సెన్సెక్స్ ట్రేడవుతోంది.
88 పాయింట్ల లాభంతో 18 వేల 622 మార్క్ వద్ద నేషనల్ స్టాక్స్ సూచీ నిఫ్టీ 50 ఇండెక్స్ కొనసాగుతోంది. బీఎస్ఈ మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.45 శాతం వృద్దిచెందింది. స్మాల్ క్యాప్ ఇండెక్స్ (బీఎస్ ఈ) 0.63 శాతం పెరిగింది. ఇలాంటి తరుణంలో 3 స్టాక్స్ అదరగొట్టడంతోపాటు టాప్ ట్రెండింగ్‌లోకి దూసుకెళ్లాయి.

ఎన్‌టీపీసీ (NTPC): నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ షేర్లు ఈరోజు ఆరంభంలో ఏకంగా 1 శాతం మేర పెరిగాయి. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్‌తో జాయింట్ వెంచర్ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించడమే ఇందుకు కారణమని మార్కెట్ వర్గాలు తెలిపాయి. ఈ వెంచర్ ద్వారా సోలార్ పీవీ, పవన విద్యుత్తు వంటివి ఏర్పాటు చేస్తాయి. 650 మెగా వాట్ల విద్యుత్తును ఉత్పత్తి చేయడమే ఈ ప్రాజెక్టు లక్ష్యం.
వరుణ్ బేవరేజెస్ (Varun Beverages): స్టాక్స్ విభజనకు జూన్ 15, 2023 రికార్డ్ డేట్ గా వరుణ్ బేవరేజెస్ కార్పొరేషన్ నిర్ణయించింది. రూ.10 ముఖ విలువ ఉన్నషేర్లను రూ.5 చొప్పున రెండుగా విభజించనున్నారు. ఈ స్టాక్ రూ.1699 మార్క్ సమీపంలో ట్రేడవుతోంది.
లుపిన్ (Lupin): జాన్సెన్ ప్రోడక్ట్స్, ఎల్‌పీ ప్రెజిస్టా ట్యాబ్లెట్స్ వంటి వాటికి జనరిక్ కౌంటర్ పార్ట్ అయిన దరునావిర్ పిల్ అనే కంపెనీ ప్రోటిజ్ ఇన్హిబిటర్స్ అనే ఔషధాన్ని తయారు చేస్తుంటుంది. రక్తంలో హెచ్ఐవీ స్థాయులను ఇది తగ్గిస్తుందికానీ పూర్తి రోగాన్ని తగ్గించలేదు. 2023 మార్చితో ముగిసిన త్రైమాసికంలో ఈ కంపెనీ వార్షిక సేల్ విలువ 308 మిలియన్ డాలర్లుగా నమోదవడంతో కంపెనీ షేర్లు బాగా రాణిస్తున్నాయి.












Click it and Unblock the Notifications