ఏడాదిలో టోల్ బూత్‌లు మాయం.. జిపిఎస్ ఇమేజింగ్ ద్వారా టోల్ వసూలు : మంత్రి నితిన్ గడ్కరీ
కేంద్ర రోడ్డు రవాణా, హైవేల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ లోక్సభలో ఈరోజు ఆసక్తికరమైన విషయాన్ని చెప్పారు. మరో ఏడాదిలో ఇండియాలో టోల్ ప్లాజాలు మొత్తం తీసివేస్తామని, జిపిఎస్ ఆధారిత టోల్ సేకరణ చేపడతామని ఆయన వెల్లడించారు. ఇప్పటి వరకు దేశంలో 93 శాతం వాహనాలు ఫాస్టాగ్ వినియోగిస్తున్నాయి అని పేర్కొన్న కేంద్ర మంత్రి మిగిలిన ఏడు శాతం వాహనాలకు రెట్టింపు టోల్ వేసినా కానీ ఇంకా ఫాస్టాగ్ తీసుకోలేదని పేర్కొన్నారు.
ఒక సంవత్సరంలో దేశంలోని అన్ని భౌతిక టోల్ ప్లాజా లను మొత్తం ఎత్తివేస్తామని పేర్కొన్న మంత్రి నితిన్ గడ్కరీ జీపీఎస్ ద్వారా టోల్ వసూలు జరుగుతుందని స్పష్టం చేశారు. గురువారం లోక్సభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా ఈ విషయాన్ని వెల్లడించారు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ . వాహనాలపై ఉండే జిపిఎస్ ఇమేజింగ్ ద్వారా టోల్ సేకరణ చేస్తామని వెల్లడించారు. అంతేకాదు ఫాస్టాగ్ ద్వారా టోల్ పన్ను చెల్లించని వాహనాలపై పోలీసు విచారణకు ఆదేశించామని పేర్కొన్నారు నితిన్ గడ్కరీ.

వాహనాలకు ఫాస్టాగ్ అమర్చకపోతే టోల్ దొంగతనం, జిఎస్టి ఎగవేత లాంటి ఘటనలు చోటుచేసుకుంటాయని నితిన్ గడ్కరీ వెల్లడించారు. ఇక ఫిబ్రవరి 16 నుండి ఫాస్టాగ్ లేని వాహనాలకు డబుల్ టోల్ ఫీజు చెల్లించాలని నిబంధన అమలవుతోందని ఆయన పేర్కొన్నారు. 2016 నుండి ఫాస్టాగ్ విధానం అమల్లో ఉందని, ముందు ముందు అంతా భౌతిక టోల్ ప్లాజాలకు బదులు జిపిఎస్ ద్వారానే చెల్లింపులు జరుగుతాయని సభా వేదికగా వెల్లడించారు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ.












Click it and Unblock the Notifications