ప్రయాణికులకు షాక్.. ఏప్రిల్ 1 నుండి పెరగనున్న టోల్ ఛార్జీలు!
ప్రయాణం అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి? దూరం ఎంతైనా, గమ్యం ఏదైనా ప్రయాణం ఒక మధురానుభూతి. కానీ ఆ ప్రయాణానికి జేబు గుల్లయ్యేలా టోల్ రుసుములు పెరిగితే ఎలా ఉంటుంది? అవును, మీరు విన్నది నిజమే! కర్ణాటక రాష్ట్రంలో ప్రయాణం చేసేవారికి ఇది చేదు వార్తే.
ఏప్రిల్ 1, 2025 నుండి కర్ణాటకలోని టోల్ ప్లాజాల వద్ద రుసుములు 3% నుండి 5% వరకు పెరగనున్నాయి. నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) ప్రతి సంవత్సరం చేసే సాధారణ సవరణలో భాగంగా ఈ నిర్ణయం తీసుకుంది.

కర్ణాటక రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 66 టోల్ ప్లాజాలలో ఈ కొత్త ధరలు అమల్లోకి రానున్నాయి. దీని ప్రభావం రోజువారీ ప్రయాణికులపైనే కాకుండా, దూర ప్రాంతాలకు వెళ్లే వారిపై కూడా పడనుంది. హోల్‌సేల్ ధరల సూచిక (WPI)లో మార్పులకు అనుగుణంగా ఈ పెంపుదల ఉంటుందని NHAI తెలిపింది. ఇది సాధారణ టోల్ రుసుము సవరణ ప్రక్రియలో భాగం మాత్రమేనని అధికారులు చెబుతున్నారు. కానీ సామాన్యుడి జేబుకు మాత్రం ఇది మరింత చిల్లు పెట్టే విధంగా ఉందని విమర్శలు వినిపిస్తున్నాయి.
సదాహళ్లి టోల్ ప్లాజా ఛార్జీలు..
ముఖ్య టోల్ ప్లాజాల వద్ద సవరించిన రుసుములు చూస్తే .. సదాహళ్లి టోల్ ప్లాజా (Kempegowda అంతర్జాతీయ విమానాశ్రయ రహదారి)లో కార్లు, జీపులు, వ్యాన్లుకు భారీగా పెంచింది. సింగిల్ జర్నీకి రూ.120. ఇది గతంలో రూ. 115 ఉండేది. రిటర్న్ జర్నీ రూ. 180 . గతంలో రూ. 170గా ఉండేది. లైట్ కమర్షియల్ వెహికల్స్ (LCVలు), మినీ బస్సులు లకు సింగిల్ జర్నీకి రూ. 185 వసూలు చేయనున్నారు. గతంలో రూ. 175 ఛార్జ్ చేసేవారు. అదే రిటర్న్ జర్నీ కి కలిపి రూ. 275 విధించారు . ఇది గతంలో రూ. 265 గా ఉండేది. ఇక ట్రక్కులు, పూర్తి-పరిమాణ బస్సులు విషయానికి వస్తే సింగిల్ జర్నీకి రూ.370 . గతంలో ఉన్న దానికంటే రూ.15 పెంచారు. రిటర్న్ జర్నీకి రూ. 550 వసూలు చేయనున్నారు . నెలవారీ కార్ పాస్ కు ( 50 ట్రిప్పులు) లకు గాను రూ. 3,970లకు పెంచారు. గతంలో ఇది రూ 3,835 ఉండేది.
శాటిలైట్ టౌన్ రింగ్ రోడ్ (STRR) టోల్ ప్లాజాల రుసులు
శాటిలైట్ టౌన్ రింగ్ రోడ్ (STRR) టోల్ ప్లాజాలైన నల్లూరు దేవనహళ్లి టోల్ ప్లాజా, హులికుంటే టోల్ ప్లాజా లలో కూడా ఛార్జీలు పెరగనున్నాయి. నల్లూరు దేవనహళ్లి టోల్ ప్లాజా (దొడ్డబళ్లాపూర్ బైపాస్ నుండి హోస్కోటే వరకు, 34.15 కి.మీ) సింగిల్ జర్నీ రూ. 85 పెరగనుంది. గతంలో రూ. 70 వసూలు చేసేవారు. రిటర్న్ జర్నీకి రూ.125 , గతంలో రూ. 105 ఉండేది. నెలవారీ కార్ పాస్ కు రూ 2,815 వసూలు చేయనున్నారు. హులికుంటే టోల్ ప్లాజా (దొబ్బస్‌పేట్ నుండి దొడ్డబళ్లాపూర్ వరకు, 42 కి.మీ)లో సింగిల్ జర్నీ రూ. 110 లకు పెరిగింది. గతంలో రూ. 105 వసూలు చేసేవారు. రిటర్న్ జర్నీకి రూ. 165 చేరింది. గతంలో రూ. 155 ఉండేది. నెలవారీ కార్ పాస్ రూ. 3,615 వసూలు చేయనున్నారు.వాహన కేటగిరీని బట్టి టోల్ రుసుములు రూ.5 నుండి రూ. వరకు పెరగనున్నాయి. చిన్న వాహనాలకు తక్కువ పెంపుదల ఉన్నప్పటికీ, భారీ వాహనాలకు మాత్రం గణనీయమైన పెరుగుదల కనిపిస్తోంది.
ప్రయాణికులు - రవాణా ఖర్చులపై ప్రభావం:
టోల్ ఛార్జీల పెంపుదల ప్రభావం వ్యక్తిగత వాహన యజమానులపై, టాక్సీలు, ప్రజా రవాణా సేవలపై స్పష్టంగా ఉంటుంది. నెలవారీ పాస్‌లు ఉపయోగించే రెగ్యులర్ ప్రయాణికులు కూడా తమ ప్రయాణ ఖర్చులలో పెరుగుదలను చూడవలసి వస్తుంది. ఈ పెంపుదల కర్ణాటకలో లాజిస్టిక్స్, రవాణా ఖర్చులపై కొంత ప్రభావం చూపుతుందని అంచనా వేస్తున్నారు. ఇప్పటికే పెట్రోల్, డీజిల్ ధరలు మండిపోతుండటంతో, టోల్ రుసుముల పెంపు మరింత భారం కానుందని వాహనదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు..
ఈ ధరల పెరుగుదల వల్ల సామాన్యుడిపై మరింత ఆర్థిక భారం పడుతుంది. నిత్యావసర వస్తువుల ధరలు పెరగడంతో సతమతమవుతున్న ప్రజలకు ఇది మరింత కష్టాన్ని కలిగిస్తుంది. ప్రయాణం అనివార్యమైనప్పుడు, ఎక్కువ రుసుములు చెల్లించక తప్పని పరిస్థితి. టోల్ రుసుముల పెంపుదల కర్ణాటకలో ప్రయాణించే ప్రతి ఒక్కరినీ ప్రభావితం చేస్తుంది. ఇది ప్రయాణ ఖర్చులను పెంచడమే కాకుండా, రవాణా , లాజిస్టిక్స్ రంగాలపై కూడా ప్రభావం చూపుతుందని అభిప్రాయం వ్యక్తం అవుతోంది.












Click it and Unblock the Notifications