వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రాష్ట్రాలను వణికిస్తున్న టమాటా ఫ్లూ కేసులు.. భారత్ కు కొత్త ఆందోళన!!

|
Google Oneindia TeluguNews

గత రెండేళ్లు భారతదేశాన్ని కరోనా మహమ్మారి గడగడలాడించింది. ప్రపంచమంతా ప్రశాంతంగా ఉన్న సమయంలో ఒక్కసారిగా విజృంభించిన కరోనా మహమ్మారి అందరినీ తీవ్ర ఆరోగ్య సంక్షోభం లోకి నెట్టింది. ఇక ఆ మహమ్మారి నుండి ఇపుడిపుడే బయటపడుతున్నామని ఊపిరిపీల్చుకున్న సమయంలో రోజుకో కొత్త వైరస్ పుట్టుకొస్తున్న తీరు ఆందోళన కలిగిస్తుంది. తాజాగా భారతదేశంలో టమాటా ఫ్లూ కేసులు విపరీతంగా పెరుగుతుండటం ఆందోళనగా మారింది.

 దేశంలో గణనీయంగా పెరుగుతున్న టమాటా ఫ్లూ కేసులు

దేశంలో గణనీయంగా పెరుగుతున్న టమాటా ఫ్లూ కేసులు


భారత దేశంలోని అనేక రాష్ట్రాలలో ఇప్పుడు టమాటా ఫ్లూ కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతుంది. టమాటా ఫ్లూ అనేది ప్రాణాలు తీసే అంత భయంకరమైన వ్యాధి కానప్పటికీ, ఈ వ్యాధి ఇతరులకు వ్యాప్తి చెందుతుంది. ఇది కోక్స్ సాకీ వైరస్ (coxsackievirus A16) ద్వారా వ్యాప్తి చెందుతుంది. ఇది వేగంగా వ్యాపించగలిగిన వైరస్. ముఖ్యంగా ఈ వ్యాధి చిన్న పిల్లలకు సోకుతుంది. ఈ వైరస్ సోకిన వారికి చేతులు నోటికి, ఎర్రటి పొక్కులు వస్తాయి. జ్వరం కూడా వస్తుంది. ముఖ్యంగా ఈ వ్యాధి ఏడాది నుంచి ఐదేళ్ల వయస్సున్న పిల్లలకు సోకుతుంది.

పిల్లలకు టమాటా ఫ్లూ భయం

పిల్లలకు టమాటా ఫ్లూ భయం


భారతదేశంలో టమాటా ఫ్లూ మొదటి కేసు ఈ సంవత్సరం మే 6వ తేదీన కేరళ రాష్ట్రంలో నమోదయింది. దీంతో కేరళ ఆరోగ్య విభాగం అప్రమత్తమై ఇతర రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. ఇక సెప్టెంబర్ లో అస్సాంలోని దిబ్రూఘర్ జిల్లాలోని 2 స్కూల్స్ లో వందకుపైగా టమాటా ఫ్లూ కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం తాజాగా తమిళనాడు ప్రభుత్వం కూడా ఈ వైరస్ పట్ల అప్రమత్తమైంది. టమాటా ఫ్లూ ప్రాణాలు తీసే వ్యాధి కానప్పటికీ ఈ వ్యాధి సోకిన పిల్లల నుంచి పెద్ద వాళ్ళకి కూడా ఇది సోకుతుందని, వ్యాప్తి చెందే అవకాశం ఎక్కువగా ఉంటుందని వైద్యులు చెబుతున్నారు.

ఈ లక్షణాలు ఉంటే జాగ్రత్త

ఈ లక్షణాలు ఉంటే జాగ్రత్త

ఎవరికైనా చేతులు, నోటి పై దద్దుర్లు, పొక్కుల వంటివి వచ్చి అవి దురదగా అనిపిస్తుంటే మిగతా వారు జాగ్రత్త తీసుకోవాలని, వారిని దూరంగా ఉంచి వారికి తగిన వైద్య సహాయాన్ని అందిస్తూ విశ్రాంతి నివ్వాలని సూచిస్తున్నారు. ఎక్కువగా గోరువెచ్చని నీటిని, ఇతర ద్రవాలను తాగించాలని అంటున్నారు. లక్షణాలను బట్టి చికిత్స చేయాల్సి ఉంటుందని, దీనికి వ్యాక్సిన్ లేదని వైద్యులు చెబుతున్నారు. ప్రస్తుతం దేశంలోని స్కూళ్లలో చిన్నారుల విషయంలో టమాట ఫ్లూ ఆందోళన వ్యక్తమవుతుంది.

English summary
Tomato flu cases are increasing in many states of India. There is concern in the country with this tomato flu that infects children. Many states have already been alerted about tomato flu cases.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X