Tomato: జహీరాబాద్ కూరగాయ మార్కెట్లో చోరీ.. టమాటాలు ఎత్తుకెళ్లిన దుండగులు..

దేశవ్యాప్తంగా టమాటా ధరలు మండిపోతున్నాయి. కిలో టమాటా కొన్ని ప్రాంతాల్లో రూ.200 నుంచి రూ.250 వరకు పలుకుతోంది. ఇక మన తెలుగు రాష్ట్రాల్లో టమాటా కిలో రూ.140 నుంచి రూ.160 పలుకుతోంది. టమాటా ధరలు భారీగా పెరగడంతో చాలా చోట్ల కూరగాయల వ్యాపారులు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకున్నారు. మరికొన్ని చోట్ల బౌన్సర్లను నియమించుకున్నారు. అయినా కొన్ని ప్రాంతాల్లో టమాటా దొంగతానలు జరుగుతున్నాయి.

కొద్ది రోజుల క్రితం కర్ణాటకలో పొలంలో ఉన్న టమాటాలను రాత్రికి రాత్రికే ఎత్తుకెళ్లారు. తాజాగా తెలంగాణలో కూడా ఇలాంటి ఘటన జరిగింది. అయితే ఇది పొలంలో కాదు.. కూరగాయల మార్కెట్ లో. జహీరాబాద్ పట్టణంలోని కూరగాయల మార్కెట్ టమాటాల దొంగతనం జరిగింది. రాత్రి సమయంలో ముఖం కనిపించకుండా హెల్మెట్, జాకెట్ ధరించి ఓ దొంగ టమాటాలు ఎత్తుకెళ్లాడు. దాదాపు రూ.8,500 విలువైన మూడు టమాటా బాక్స్ లను చోరీ చేశాడు.

tomatothefting1

ఉదయన్నే కూరగాయ మార్కెట్ కు రాగా టమాటా మూడు టమాటా బాక్స్ లు మిస్సయినట్లు గుర్తించాడు వ్యాపారి. వెంటనే సీసీ కెమెరాలు పరిశీలించగా.. టమాటా ట్రేలను ఎత్తుకెళ్లినట్లు గుర్తించాడు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కూరగాయల మార్కెట్ కు వచ్చిన పోలీసులు సీసీ ఫుటేజీని స్వాధీనం చేసుకున్నారు. దొంగలను త్వరలోనే పట్టుకుంటామని తెలిపారు. మిగతా చోట్ల సీసీ కెమెరాల ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.

దీంతో కూరగాయలు మార్కెట్లలో భద్రత పెంచుకోవాలని కొందురు సూచిస్తున్నారు. ఇక టమాటాలు వినియోగదారులకు కన్నీళ్లు తెప్పిస్తుంటే.. రైతులకు మాత్రం సిరులు కురిపిస్తోంది. మెదక్ జిల్లా చెందిన మహిపాల్ రెడ్డి అనే రైతు గత నెల రోజుల్లో టమాటాల ద్వారా రూ.1.84 కోట్లు ఆర్జించారు. ఆయన 12 ఎకరాల్లో టమాటా సాగు చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+