వీరు ఇలా.. ఆ 5 రాష్ట్రాల్లో మిగిలిన వ్యాక్సిన్.. ఎన్ని కోట్ల డోసులు అంటే...
అసలే కరోనా.. అపై ఒమిక్రాన్ వేరియంట్... భయాందోళన వ్యక్తం అవుతుంది. వ్యాక్సిన్ వేసుకోవాలని నిపుణులు నెత్తి నోరు బాదుకుంటున్నారు. కానీ కొన్ని రాష్ట్రాలు లెక్క చేయడం లేదు. అవును పట్టించుకోవడం లేదు. వ్యాక్సిన్ కావాలని.. తీసుకుంటామని అందరూ ముందుకు వస్తుంటే 5 రాష్ట్రాల్లో మాత్రం టీకాలు మిగిలాయి.. కాదు కాదు తీసుకోకపోవడంతో అలానే ఉన్నాయి.
దేశంలో ఐదు రాష్ట్రాలు కరోనా వ్యాక్సిన్లను సరిగా ఉపయోగించుకోలేదు. కేంద్ర ప్రభుత్వ గణాంకాలు సృష్టం చేస్తున్నాయి. ఉత్తరప్రదేశ్,మహారాష్ట్ర, వెస్ట్ బెంగాల్, బీహార్, రాజస్తాన్‌లో దాదాపు 11 కోట్ల కోవిడ్ వ్యాక్సిన్ బాలెన్స్ డోసులు ఉన్నట్లు కేంద్రం ఆరోగ్యశాఖ మంగళవారం రాజ్యసభకు తెలిపింది. ఉత్తరప్రదేశ్ లో అత్యధికంగా వినియోగించని కోవిడ్ వ్యాక్సిన్ డోసులు 2.9 కోట్లు ఉండగా, బెంగాల్ లో 2.5 కోట్లు, మహారాష్ట్రలో 2.2 కోట్లు, బీహార్ లో 1.80 కోట్లు, రాజస్తాన్ లో 1.43 కోట్లు,తమిళనాడులో 1.35 కోట్లు, మధ్యప్రదేశ్ లో 1.1 కోట్ల వినియోగించని వ్యాక్సిన్ డోసులు ఉన్నాయని కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది.

దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల వద్ద మొత్తం 23 కోట్ల కోవిడ్ వ్యాక్సిన్ డోసులు అందుబాటులో ఉన్నాయని తెలిపింది. కొన్ని రాష్ట్రాలు అత్యధిక టీకాలు వేయని జనాభాను కలిగి ఉన్నాయని, ఆ రాష్ట్రాల్లో ఇంకా వ్యాక్సిన్ మొదటి డోస్ తీసుకోనివారు కూడా చాలా మంది ఉన్నారని తెలిపింది. దేశంలోనే పెద్ద రాష్ట్రం యూపీలో 3.50 కోట్ల మంది ఇంకా మొదటి డోసునే తీసుకోలేదు. బిహార్‌లో 1.89 కోట్ల మంది, మహారాష్ట్రలో 1.71కోట్లు, తమిళనాడులో 1.24 కోట్ల మంది ఇంకా మొదటి డోసును తీసుకోలేదని కేంద్ర ఆరోగ్యశాఖ డేటా చెబుతోంది.
Recommended Video
ఇటు ఒమిక్రాన్ వైరస్ టెన్షన్ వెన్నులో వణుకు పుట్టిస్తోంది. కరోనా సెకండ్ వేవ్ గడ గడలాడించిన సంగతి తెలిసిందే. ఒమిక్రాన్ మూడో వేవ్ అనడంతో సర్వత్రా ఆందోళన నెలకొంది. అయితే వైరస్ నేపథ్యంలో ఒకటికీ రెండుసార్లు తనిఖీ చేయడం సహజమే.. కానీ కొందరు అవమాన పడాల్సి వస్తోంది. ఇటీవల లండన్ నుంచి వచ్చిన హైదరాబాదీ యువతి ఆ నిట్టూర్పు తప్పలేదు. ఇటు ఒమిక్రాన్ డెల్టా కంటే వేగంగా వ్యాపిస్తుంది. తీవ్ర ఒళ్ళు నొప్పులు, నీరసం, తలనొప్పి వంటి లక్షణాలు ఓమిక్రాన్ సోకిన వారికి ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. విదేశాల నుంచి వచ్చిన వారికి ఒమిక్రాన్ వైరస్ సోకుతుంది.












Click it and Unblock the Notifications