సుప్రీంకోర్టుకు సీబీఐ వివాదం, నాగేశ్వరరావు నియామకం పైనా: జేపీ, లక్ష్మీనారాయణ ఏమన్నారంటే?
Recommended Video

న్యూఢిల్లీ: సీబీఐ డైరెక్టర్ బాధ్యతల నుంచి తనను తప్పించడంపై అలోక్ వర్మ కేంద్ర ప్రభుత్వంపై న్యాయపోరాటానికి సిద్ధమయ్యారు. ఈ మేరకు ఆయన సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అలోక్ వర్మ పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన అత్యున్నత న్యాయస్థానం విచారణను ఎల్లుండి (శుక్రవారం) విచారించనుంది.
చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్, జస్టిస్ ఎస్‌కే కౌల్, కేఎం జోసెప్‌లతో కూడిన ధర్మాసనం విచారించనుంది. అదే సమయంలో సీబీఐ తాత్కాలిక చీఫ్‌గా నాగేశ్వర రావును నియమించడం పైన కూడా అలోక్ వర్మ పిటిషన్ దాఖలు చేశారు.

కాంగ్రెస్ విమర్శలు
రాకేష్ ఆస్థానాను కాపాడేందుకే సీబీఐ డైరెక్టర్ అలోక్ వర్మను తప్పించారని కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది. మోడీ ప్రభుత్వం సీబీఐ స్వాతంత్రాన్ని కూడా దెబ్బతీసిందని కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణ్‌దీప్ సుర్జేవాలా అన్నారు. వ్యవస్థను నాశనం చేయడం, సిబిఐని బజారుకీడ్చడం కూడా అయిపోయిందని అభిప్రాయపడ్డారు. అత్యున్నత సీబీఐను నిర్వీర్యం చేశారన్నారు. ఈ అంశంపై మరో కాంగ్రెస్ నేత అభిషేక్ సింఘ్వీ కూడా విమర్శలు గుప్పించారు.

నిమిషాల్లో రంగంలోకి దిగిన నాగేశ్వర రావు
సీబీఐ ఇంచార్జి డైరెక్టర్‌గా మన్నెం నాగేశ్వర రావు మంగళవారం అర్ధరాత్రి నియమించబడ్డారు. ఆ తర్వాత ఆయన బాధ్యతలు తీసుకున్నారు. కొద్ది నిమిషాల్లోనే ఆయన రంగంలోకి దిగారు. రాత్రి ఒంటి గంటకు సీబీఐ ఆఫీసును ఢిల్లీ పోలీసులు చుట్టుముట్టారు. అర్ధరాత్రి ఒకటింపావుకు నాగేశ్వర రావు సీబీఐ కార్యాలయంలోకి వచ్చారు. ఆ తర్వాత సోదాలు నిర్వహించి, 11వ ఫ్లోర్‌లోని సీబీఐ డైరెక్టర్, స్పెషల్ డైరెక్టర్ల చాంబర్లు సీజ్ చేసినట్లుగా వార్తలు వచ్చాయి. 10వ ఫ్లోర్‌ను సీబీఐ కొత్త డైరెక్టర్లు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. అయితే సీబీఐ హెడ్ క్వార్టర్‌లో ఏ గదిని కూడా సీజ్ చేయలేదని సీబీఐ అధికార ప్రతినిధి చెప్పారు. కాగా, బుధవారం మధ్యాహ్నం రెండు గంటల వరకు ఢిల్లీ పోలీసుల అదుపులోనే సీబీఐ కార్యాలయం ఉంటుంది. అప్పటి వరకు కేసు ఫైళ్ల కదలికకు బ్రేక్ పడనుంది.

జయప్రకాశ్ నారాయణ ఏం చెప్పారంటే?
సీబీఐలో జరుగుతున్న అంశంపై లోక్‌సత్తా వ్యవస్థాపక అధ్యక్షులు జయప్రకాశ్ నారాయణ స్పందించారు. అలోక్ వర్మ, రాకేష్ ఆస్థానాలను వెంటనే తప్పించాలన్నారు.(ఇప్పటికే ప్రభుత్వం వారిని సెలవులపై పంపించింది.) ఇద్దరు కూడా దేశ ప్రతిష్టను దెబ్బతీసేలా వ్యవహరించారన్నారు.

నాకు ఎలాంటి ఒత్తిళ్లు రాలేదు
సీబీఐలో జరుగుతున్న వ్యవహారాల్లో నిజాలను నిగ్గు తేల్చాలని ఆ శాఖలో పని చేసిన లక్ష్మీనారాయణ అన్నారు. ఇలాంటి వివాదాల వల్ల సీబీఐ ప్రజల విశ్వాసం కోల్పోతుందని చెప్పారు. తాను అధికారిగా ఉన్నప్పుడు తనపై ఎలాంటి ఒత్తిళ్లు రాలేదని చెప్పారు. తన పనిని తాను స్వతంత్రంగా చేసుకుపోయానని చెప్పారు. సీబీఐలో అధికారుల నియామక ప్రక్రియ పకడ్బంధీగా ఉంటుందన్నారు. అయినా ఇలాంటి సంఘటనలు బాధాకరమన్నారు.
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్‌కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!!












Click it and Unblock the Notifications