షాక్: బిగ్‌బాస్ కంటెస్టెంట్ ఆత్మహత్య: కుళ్లిన స్థితిలో మృతదేహం స్వాధీనం
కన్నడ చలన చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖ నటుడు, దర్శకుడు గురుప్రసాద్ ఆత్మహత్య చేసుకున్నారు. ఆయన వయస్సు 52 సంవత్సరాలు. బెంగళూరు మాదనాయకనహళ్లిలో గల అపార్ట్‌మెంట్‌లో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు. కుళ్లిన స్థితిలో ఆయన మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
మూడు రోజుల కిందట ఆయన ఆత్మహత్య చేసుకుని ఉండొచ్చని అనుమానిస్తోన్నారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. ఫ్లాట్ తలుపులు పగులగొట్టి లోనికి వెళ్లారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని, పోస్ట్‌మార్టమ్ కోసం తరలించారు.

శనివారమే ఆయన 52 పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయనకు శాండిల్‌వుడ్‌కు చెందిన పలువురు నటులు, దర్శకులు, ఇతర టెక్నీషియన్లు శుభాకాంక్షలు చెప్పడానికి ప్రయత్నించినప్పటికీ సాధ్యపడలేదు. ఫోన్‌లో అందుబాటులోకి రాలేదు. జన్మదినం కంటే అంతకుముందే ఆత్మహత్యకు పాల్పడి ఉండొచ్చని భావిస్తోన్నారు. ఆయన ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు.
బెంగళూరు దక్షిణ జిల్లాలోని కనకపురాలో 1972లో జన్మించారు గురుప్రసాద్. పూర్తిపేరు గురుప్రసాద్ రామచంద్ర శర్మ. 2006లో శాాండిల్‌వుడ్‌లో అడుగు పెట్టారు. ఆయన దర్శకత్వం వహించిన తొలి సినిమా మఠ. ఆ సినిమా హిట్ కావడంతో వెనుదిరిగి చూసుకోలేదు.

ఎద్దేళు మంజునాథ, డైరెక్టర్స్ స్పెషల్, ఎరడనే సాలా, రంగనాయక సినిమాలకు దర్శకత్వం వహించారు. అడేమా అనే సినిమా సెట్స్‌పై ఉంది. దర్శకుడిగా కొనసాగుతూనే పలు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలను పోషించారు. కొన్ని సినిమాలకు రచయితగా కూడా వ్యవహరించారు.
స్వీయ దర్శకత్వం వహించన మఠ, ఎద్దేళు మంజునాథ, డైరెక్టర్స్ స్పెషల్, మైలారి, కాల్ మంజా, హుడుగరు, విజిల్, జిగర్‌తండా, అనంతు vs నుస్రత్, ఖుష్కా, బడవ రాస్కెల్, బాడీ గాడ్ సినిమాల్లో నటించారు. శాండిల్‌వుడ్ సూపర్ స్టార్ కిచ్చ సుదీప్ హోస్ట్‌గా వ్యవహరిస్తోన్న బిగ్ బాస్ సీజన్ 2లో మెరిశారు. వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా హౌస్‌లోకి వెళ్లారు.












Click it and Unblock the Notifications