నార్త్ ఇండియా టూర్.. 7 బెస్ట్ డెస్టినేషన్స్ ఇవే.. వీకెండ్ ఎంజాయ్ కు బెస్ట్ ఛాయిస్
భారత్ లో ప్రకృతి అందాలు, చారిత్రక కట్టడాలు, బీచ్ లు, సాహస క్రీడలతో ఆకట్టుకునే ఎన్నో ప్రదేశాలు ఉన్నాయి. అయితే దేశవ్యాప్తంగా ఉన్న దర్శనీయ స్థలాలు, పర్యటక ప్రదేశాలను చూడాలని చాలామందికి ఉంటుంది. కానీ పని ఒత్తిడి, బిజీ లైఫ్, ఉరుకులు పరుగుల జీవితం కారణంగా చాలామంది వాయిదా వేస్తుంటారు. ఇంకొంతమందికి ఎలా వెళ్లాలో తెలియక మానేస్తుంటారు. మరికొంత మందికి ఏఏ ప్రదేశాలకు వెళ్లాలో అర్థం కాదు. అయితే ఎక్కువ రోజులు కాకుండా జస్ట్ రెండు రోజుల్లో వీకెండ్ ను ఫుల్ గా ఎంజాయ్ చేసే విధంగా 7 బెస్ట్ డెస్టినేషన్స్ గురించి ఇక్కడ తెలుసుకుందాం. కేవలం శని, ఆదివారాల్లోనే ఈ ప్రాంతాల్లో ఎంజాయ్ చేసి రావచ్చు. అందులో ఉత్తరాఖండ్ లోని రిషికేశ్ ఒకటి. హిమాలయాల దిగువన పవిత్ర గంగానది ఒడ్డున ఈ పర్యాటక ప్రాంతం ఉంది. ఇది ఆధ్యాత్మిక, అడ్వెంచర్ జర్నీకి కేరాఫ్ అడ్రస్ గా ఉంటుంది. అలాగే ఉత్తరాఖండ్ ను ప్రపంచ యోగా రాజధానిగా పిలుస్తారు.
ఇక్కడ ముఖ్యమైన పర్యాటక వివరాలు చూస్తే.. లక్ష్మణ్ ఝాలా అండ్ రామ్ ఝూలా, త్రివేణి ఘాట్ అలాగే చౌరాసి కూటియా, తేరా మంజిల్ ఆలయం, నీర్ గర్ జలపాతం తదితర ప్రదేశాలు పర్యాటకులను ఆకర్షిస్తున్నాయి. ఇక రివర్ రాఫ్టింగ్, బంజీ జంపింగ్ లాంటి అడ్వెంచర్ క్రీడలు కూడా ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ అక్టోబర్ నుంచి మార్చి మధ్యలో సందర్శించడానికి అనుకూలమైన సమయంగా చెబుతారు. ఇక రాజస్థాన్ రాజధాని జైపూర్ ను అందరూ పింక్ సిటీ అని పిలుస్తుంటారు. ఇది భారత్ లోని ప్రముఖమైన పర్యాటక ప్రాంతాల్లో ఒకటిగా నిలుస్తోంది. ఇక్కడ అంబర్ కోట, హవా మహల్, జంతర్ మంతర్, సిటీ ప్యాలెస్, జల్ మహల్, నహర్ ఘర్, జైగర్ కోటలు ప్రముఖమైన పర్యాటక ప్రాంతాలుగా ఉన్నాయి.
ఇక లోనావాలా ప్రాంతం మహారాష్ట్రలోని సహ్యాద్రి పర్వత శ్రేణుల్లో ఉంది. ఇది అద్భుతమైన హిల్ స్టేషన్ గా పేరుగాంచింది. ఇక్కడ ముఖ్యమైన పర్యాటక ప్రదేశాలు చూస్తే భూషి డ్యామ్, టైగర్ పాయింట్, కర్లా అలాగే భాజా గుహలు, లోహగఢ్ కోట, పావ్నా సరస్సు తదితర ప్రాంతాలు పర్యాటక ప్రదేశాలుగా ఉన్నాయి. ఇక వర్షాకాలంలో జూలై నుంచి సెప్టెంబర్ వరకు లోనావాలాలో ఆహ్లాదకరమైన వాతావరణం, జలపాతాల సవ్వడులు, ఎంతో అద్భుతమైన అనుభూతిని కలిగి ఉంటాయి. అలాగే రాజస్థాన్ లో మరో ప్రముఖ పర్యాటక ప్రాంతం ఉదయ్ పూర్.. ఈ ప్రాంతాన్ని సిటీ ఆఫ్ లేక్స్ అని పిలుస్తుంటారు. అలాగే వెనిస్ ఆఫ్ ది ఈస్ట్ గా అభివర్ణిస్తుంటారు. ఇక్కడి పిచోలా సరస్సు, జగ్ మందిర్, ఫతే సాగర్ సరస్సు, సహేలియోన్ కా బారి తదితర ప్రదేశాలు పర్యటకులకు బెస్ట్ ఛాయిస్ గా ఉన్నాయి.

పాండిచ్చేరిలో బీచ్ లు, కెఫేల గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇక్కడి వైట్ టౌన్ లోని ఫ్రెంచ్ శైలిలో నిర్మించిన భవనాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంటాయి. ఇక్కడికి దగ్గరలో అరబిందో ఆశ్రమం కూడా ఉంటుంది. ఇక కూర్గ్ లో కొండలు, కాఫీ తోటల అందాలు పర్యటకుల్ని మైమరింపజేస్తుంటాయి. ఇక్కడ మంచు కొండలు, అబ్బే జలపాతం, రాజాస్ సీట్ అందమైన ప్రకృతి రమణీయమైన దృశ్యాలకు నెలవుగా ఉంటుంది.












Click it and Unblock the Notifications