వావ్.. కాప్, ప్రాణాలను తెగించి మరీ చిన్నారిని కాపాడిన కానిస్టేబుల్..
రెప్పపాటులో ప్రమాదాలు జరుగుంటాయి. ఆ సమయంలో అప్రమత్తంగా ఉండటం తప్ప చేసేదేమీ లేదు. కొన్ని ఇన్సిడెంట్స్ ఇలానే జరుగుతుంటాయి. ఇటీవల ఓ ఘటన జరిగింది. అయితే ఎక్కడ జరిగిందో తెలియడం లేదు. కానీ ఓ ట్రాఫిక్ పోలీసు అప్రమత్తంగా అప్రమత్తంగా వ్యవహరించాడు. క్షణకాలంలో ఓ చిన్నారిని కాపాడారు. ఇప్పుడు ఆ వీడియో వైరల్ అవుతుంది. ఇంటర్నెట్‌లో తెగ చక్కర్లు కొడుతుంది.

పడిపోయిన చిన్నారి
ఆ రోడ్డు రద్దీగా ఉంది. మధ్యలో కానిస్టేబుల్ ఉండి.. ట్రాఫిక్ మేనెజ్ చేస్తున్నారు. అతని వెనక నుంచి బస్సు వస్తోంది. సరిగ్గా ఆ సమయంలోనే సందుల నుంచి ఆటో కూడా వస్తోంది. ఆటో నుంచి ఓ చిన్నారి పడిపోయింది. సరిగ్గా రోడు మీద పడిపోవడంతో ఆందోళన నెలకొంది. కానీ వెంటనే ట్రాఫిక్ కానిస్టేబుల్ పరుగు తీశాడు. వెంటనే ఆ చిన్నారిని తీసుకున్నాడు. ఇంతలో బస్సు వస్తుందని.. తనకేం గాయం అవుతుందని లెక్క చేయలేదు. ఆ కానిస్టేబుల్ చూపిన ధైర్యం మిగతా వారికి ఆదర్శంగా నిలుస్తోంది.

బ్రేక్ వేసిన డ్రైవర్
అయితే ఆ బస్సు డ్రైవర్ కూడా చిన్నారి పడిపోవడం చూశాడు. వెంటనే బ్రేక్ వేశాడు. ఆమెకు దూరంలోనే బస్సు ఆగిపోయింది. లేదంటే ప్రమాదం జరిగేది. పిల్లతోపాటు.. కానిస్టేబుల్ గాయపడేవారు. కానీ డ్రైవర్ కూడా చాకచక్యంగా వ్యవహరించాడు. ఆ చిన్నారిని సేవ్ చేశాడు. ఆ వీడియో చూస్తే మాత్రం ఒళ్లు జరదరిస్తోంది. కాప్ ధైర్య, సాహసాలను మెచ్చుకుంటున్నారు.

శభాష్ కాప్
వీడియో తెగ చక్కర్లు కొడుతుంది. నెటిజన్లు రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. కాప్ చూపిన తెగువను కొనియాడుతున్నారు. డ్రైవర్ కూడా సమయస్ఫూర్తితో వ్యవహరించారని కామెంట్ చేశారు. అలా చిన్నారి ప్రమాదం నుంచి బయటపడింది. చాలా మంది కాప్ అంటే ఇలానే ఉండాలి అంటున్నారు. ఏదో తన డ్యూటీ మాత్రమే చేస్తానని ఉండొద్దని.. అన్నింటినీ పట్టించుకోవాలని సూచించారు.












Click it and Unblock the Notifications