Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

8 ఏళ్ల బాలుడిని కొరికి చంపిన ఎలుగుబంటి.. ఎక్కడంటే..?

8 ఏళ్ల పిల్లాడిని ఎలుగుబంటి కొరికి చంపిన ఘటన తమిళనాడులోని వల్పరాయ్ లో జరిగింది. వల్పరాయ్ లోని ఓ టీ ఎస్టేట్ లో బాలుడి మృత దేహం లభ్యమైంది. ఎలుగుబంటి బాలుడి మృత దేహాన్ని సగం తిన్నట్లు గుర్తించారు పోలీసులు. ఈ మేరకు డెడ్ బాడీని స్వాధీనం చేసుకుని పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

తమిళనాడులోని కోయంబత్తూరు జిల్లా వల్పరాయ్ గ్రామంలోని ఓ టీ ఎస్టేట్ లో విషాదం జరిగింది. ఓ 8 ఏళ్ల బాలుడిని ఎలుకు బంటి కొరికి చంపింది. అంతేకాక బాలుడి మృత దేహంలోని కొన్ని భాగాలను తినేసి వెళ్లిపోయింది. బాలుడ్ని నూర్ ఉల్ హక్(8) గా గుర్తించారు పోలీసులు.

బాలుడి తండ్రి తెలిపిన వివరాల ప్రకారం.. అసోంకు చెందిన ఆ దంపతులు చాలా ఏళ్ల క్రితం వలస వచ్చి వల్పరాయ్ గ్రామంలోని ఓ టీ ఎస్టేట్ పనులు చేస్తున్నారు. అయితే ఆ దంపతుల కుమారుడు నూర్ ఉల్ హక్ కు 8 ఏళ్లు. రోజూలాగే పాలు తీసుకొచ్చేందుకు స్థానికంగా ఉన్న ఓ ఇంటికి వెళ్లి వస్తుండగా.. అప్పటికే పొదల్లో నక్కి ఉన్న ఎలుగుబంటి అమాంతం పిల్లాడి పైకి దూకి పొదల్లోకి లాక్కెల్లింది. బాలుడ్ని కొరికి చంపేసింది. అనంతరం కళ్లు, మెదడుని తిని వెళ్లిపోయింది.

అయితే నూర్ ఉల్ హక్ ఇంకా రాలేదని గ్రహించిన తల్లిదండ్రులు, స్థానికులు ఎస్టేట్ లో వెతకడం ప్రారంభించారు. అయితే దారిలో వాళ్లకు పాలు, రక్తం పడిన చోటు కనిపించింది. దీంతో అక్కడే పొదల్లోకి వెళ్లి చూడగా బాలుడి మృత దేహం లభ్యమైంది. దీంతో వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వగా వాళ్లు వచ్చి మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. బాలుడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

Tragic Bear Attack 8-Year-Old Boy Killed in Tamil Nadu s Valparai

గతంలోనూ ఇదే ప్రాంతంలో ఇలాంటి ఘటనే జరిగింది. జూన్‌ నెలలో పాచమలై ఎస్టేట్ సమీపంలో ఆ ఘటన జరిగింది. కలియమ్మాల్ నివాస ప్రాంతంలో జార్ఖండ్‌ నుంచి వలస వచ్చిన దంపతులకు చెందిన నాలుగేళ్ల రోషిని కుమారని చిరుతపులి ఈడ్చుకెళ్లి చంపేసింది. ఇప్పుడు అలాంటి ఘటనే జరగడం ఇది రెండోసారి.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+