పవర్ ప్లాంట్ లో ప్రమాదం.. 9 మంది కార్మికులు మృతి
తమిళనాడులో షాకింగ్ ఘటన జరిగింది. చెన్నైలోని ఎన్నోర్ పవర్ ప్లాంట్ లో నిర్మాణంలో ఉన్న పరంజా కుప్పకూలింది. ఈ ప్రమాదంలో 9 మంది కార్మికులు మృతి చెందారు. ఘటన జరిగిన వెంటనే వాళ్లను స్థానిక స్టాన్ లీ ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే వాళ్లు మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. అయితే ఈ ప్రమాదంలో మరికొంత మంది కార్మికులకు గాయాలైనట్లు సమాచారం. వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
తమిళనాడును వరుస విషాదాలు వెంటాడుతున్నాయి. ఇటీవల టీవీకే అధ్యక్షుడు విజయ్ కరూర్ లో నిర్వహించిన ర్యాలీలో తొక్కిసలాట జరిగి 41 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. మృతుల్లో చిన్నపిల్లలు, మహిళలు కూడా ఉన్నారు. అయితే తాజాగా తమిళనాడులో మరో విషాద ఘటన జరిగింది. చెన్నైలోని ఎన్నోర్ థర్మల్ పవర్ ప్లాంట్ లో నిర్మాణంలో ఉన్న పరంజా కుప్పకూలింది. ఈ ఘటనలో 9 మంది వలస కార్మికులు అక్కడికక్కడే మృతి చెందారు. మరికొంతమంది కార్మికులకు గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానిక స్టాన్ లీ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే వారి ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు సమాచారం.

ఎన్నోర్ థర్మల్ పవర్ ప్లాంట్ లో గతకొంత కాలంగా అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. ఈ ప్లాంట్ లో వందలకొద్దీ నార్త్ ఇండియన్ కార్మికులు ఏళ్లుగా పనులు చేస్తున్నారు. కార్మికులు ఓ బెండింగ్ స్ట్రక్చర్ ను అమర్చే క్రమంలో అది కింద పడిపోయింది. దీంతో దాని కింద పడిన కార్మికులు మృతి చెందినట్లు సమాచారం.












Click it and Unblock the Notifications