ఘోర రోడ్డు ప్రమాదం.. కుంభమేళా నుంచి వస్తూ ఆరుగురు భక్తులు మృతి

మధ్యప్రదేశ్ లోని జబల్ పుర్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రైవేట్ బస్సు, జీపు ఢీకొన్న ఘటనలో ఆరుగురు మృతి చెందారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలు అయ్యాయి. కర్ణాటకలోని బెలగావి జిల్లా ఘోకక్ మండలానికి చెందిన భక్తులు.. మహా కుంభమేళాలోని త్రివేణి సంగమంలో పుణ్య స్నానాలు ఆచరించి తిరిగి వస్తున్న క్రమంలో ప్రైవేట్ బస్సు, జీపు ఒకదానికొకటి ఢీకొన్నాయి. జబల్ పుర్ లోని ఫారేవా గ్రామం, కితౌలా పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది.

జబల్ పుర్ కలెక్టర్ దీపక్ సక్సేనా తెలిపిన వివరాల ప్రకారం.. కర్ణాటకలోని బెలగావికి చెందిన జీపు అదుపుతప్పి డివైడర్ వద్ద ఉన్న చెట్టును ఢీకొట్టింది. అమాంతం గాలిలోకి ఎగిరి వ్యతిరేక దిశలో వస్తున్న ట్రావెల్ బస్సును ఢీకొంది. ఈ ఘటనలో ఆరుగురు భక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించి.. ఆ తర్వాత మెరుగైన చికిత్స కోసం జబల్ పూర్ కు తరలించారు. ఈ ఘటన అనంతరం ట్రావెల్ బస్సు డ్రైవర్ అక్కడి నుంచి పారిపోయినట్లు సమాచారం.

Tragic Collision in Jabalpur Six Dead Two Injured in Private Bus-Jeep Crash

సమాచారం తెలుసుకున్న వెంటనే ఘటనాస్థలికి జిల్లా కలెక్టర్, ఎస్పీ చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+