లోయలో పడ్డ బస్సు- ఐదుగురు మృతి- 17మందికి తీవ్రగాయాలు
గుజరాత్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఇవాళ తెల్లవారుజామున ప్రయాణికులతో వెళ్తున్న ఓ ట్రావెల్ బస్సు అదుపుతప్పి లోయలో పడింది. ఈ ఘటనలో ఐదుగురు మృతి చెందారు. మరో 17 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన డాంగ్ జిల్లాలోని సపుతరా హిల్ స్టేషన్ పరిధిలో జరిగింది. ప్రయాణికులంతా మహారాష్ట్రలోని త్రయంబకేశ్వర్ నుంచి గుజరాత్‌లోని ద్వారకకు వస్తుండంగా ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని క్షతగాత్రుల్ని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.
ఆదివారం తెల్లవారుజామున 4:30 గంటల సమయంలో ఈ ఘటన జరిగినట్లు జిల్లా ఎస్పీ ఎస్జీ పాటిల్ తెలిపారు. "తెల్లవారుజామున రోడ్డును పూర్తిగా మంచు కప్పేసింది. దీంతో బస్సు అదుపుతప్పి 35 అడుగుల లోతులో పడింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మహిళలు సహా ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో 17 మంది తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 48 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది" అని వివరించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని అన్నారు.

-
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
చర్లపల్లి నుంచి ఏపీ మీదుగా కొత్త అమృత్ భారత్-హాల్ట్ లు ఇవే, ఆ రోజు నుంచే..! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
రైతు భరోసా నిధుల విడుదల వేళ మరో ట్విస్ట్, కీలక మార్పులు..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరిక వేళ బీజేపీ బిగ్ ట్విస్ట్, రూట్ క్లియర్..!! -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత












Click it and Unblock the Notifications