750 కి.మీ ప్రయాణం: గోరఖ్‌పూర్ కాదు రూర్కెలా, దారి మరచిన డ్రైవర్, ప్యాసెంజర్స్ ఆందోళన..

మనం చేరుకోవాల్సిన గమ్యం.. 5, 10 కిలోమీటర్లు ఆలస్యమైతే చిర్రెత్తుకొస్తోంది. అరగంట, గంట అయితే కోపం నాశళానికి ఎక్కుతోంది. అలాంటిది ఓ రైలు డ్రైవర్ వలసకూలీలు దింపాల్సిన గమ్యం స్థానంలో కాకుండా మరో చోట డ్రాప్ చేశారు. సారీ.. సారీ మరో రాష్ట్రంలో రైలును ఆపాడు. అవును తమ గమ్యస్థానం ఇంకా 750 కిలోమీటర్లు ఉంది అని తెలిసి ప్రయాణికులు నోరెళ్లబెట్టారు.

ముంబై వాసయ్ స్టేషన్ నుంచి నుంచి వలసకూలీలతో కూడిన శ్రామిక్ రైలు మంగళవారం బయల్దేరింది. అయితే డ్రైవర్ గమ్య స్థానం గోరఖ్ పూర్ కాకుండా మరోవైపునకు తీసుకెళ్లాడు. మధ్యలో పట్టాలు కలవడంతో డ్రైవర్ వారిని ఒడిశాలోని రూర్కెలా తీసుకెళ్లాడు. మరునాడు రైల్వేస్టేషన్‌లో దిగాక.. ప్రయాణికులు చూసి.. ఇదేంటి అని అడిగారు. రూర్కెలా అని చెప్పడంతో ఎందుకిలా అని అడిగారు. డ్రైవర్ దారి తప్పాడని చెప్పడంతో ఆందోళన వ్యక్తం చేశారు.

Train Carrying Migrants Maharashtra to UP Ends up in Odisha..

అయితే డ్రైవర్ తప్పుడు మార్గంలో వెళ్లలేదని.. రాంగ్ రూట్ ఇచ్చారని రైల్వేశాఖ చెబుతోంది. ప్రయాణికులను తీసుకెళ్లాల్సిన గమ్యం, డ్రైవర్‌కు అందజేసిన రూట్ వేరు వేరు అని తెలిపింది. తాము కొన్ని శ్రామిక్ రైలు రూట్లను మళ్లించాలని అనుకొన్నామని.. కొన్ని రైళ్లను బీహర్ వయా రూర్కెలా మీదుగా మళ్లించామని అధికారులు తెలిపారు. కానీ రైలులో ఉన్న ప్రయాణికులకు సమాచారం ఇవ్వకపోవడం మాత్రం అధికారుల తప్పిదమే అవుతోంది. అంతేకాదు రూర్కెలా నుంచి గోరఖ్ పూర్ ఎప్పుడు వెళుతుందో కూడా చెప్పలేదు. కానీ వారిని సొంత రాష్ట్రానికి పంపిస్తామని మాత్రం చెబుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+