వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గులాబీల స్వాగతం: ఇక రైళ్లలో ట్రెయిన్ హొస్టేస్!

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: రైల్వేలో పలు సంస్కరణలు తీసుకొస్తున్న రైల్వే శాఖ తాజా మరో ప్రయత్నం చేస్తోంది. ఇందులో భాగంగా విమానాల్లో లాగే త్వరలో రైలు ప్రయాణికుల కోసం ట్రెయిన్‌ హోస్టెస్‌లు రానున్నారు.

దేశంలో ఢిల్లీ- ఆగ్రాల మధ్య నడిచే మొదటి సెమీ హైస్పీడ్‌ రైలు అయిన గతిమాన్‌ ఎక్స్‌ప్రెస్‌లో ఈ ట్రెయిన్‌ హోస్టెస్‌ల ఏర్పాటుకు రైల్వే శాఖ సన్నాహాలు చేస్తోంది. ఈ రైళ్లలో ట్రెయిన్ హొస్టేస్ ప్రయాణికులకు గులాబీ పూలతో స్వాగతం పలకనున్నారు.

మార్చిలో ఈ రైలు సర్వీసులు ప్రారంభించనున్నారు. ఈ రైల్లో హై-పవర్‌ అత్యవసర బ్రేకింగ్‌ సిస్టమ్‌, ఆటోమేటిక్‌ ఫైర్‌ అలారం, స్లైడింగ్‌ ద్వారాలతో పాటు లైవ్‌ టీవీ సౌకర్యం ఉంది. విమాన సర్వీసుల్లాగే గతిమాన్‌ రైల్లో క్యాటరింగ్‌ సర్వీసుతో పాటు అన్ని సౌకర్యాలు ఏర్పాటుచేయడానికి సన్నాహాలు చేస్తోంది.

Train hostesses to welcome travellers with roses

కాగా, ఈ విశేషాలను రైల్వే మంత్రి సురేశ్‌ ప్రభు ఫిబ్రవరి 25న ప్రవేశపెట్టనున్న రైల్‌ బడ్జెట్‌లో ప్రకటించనున్నారు. టికెట్‌ ధర శతాబ్ది ఎక్స్‌ప్రెస్‌ ధర కంటే 25 శాతం ఎక్కువగా ఉండనుంది. క్యాటరింగ్‌లో భారతీయ వంటకాలతోపాటు విదేశీ వంటకాలు ఉంటాయి.

ఇలాంటి రైళ్లను కాన్పూర్‌-ఢిల్లీ, ఛండీగడ్‌-ఢిల్లీ,హైదరాబాద్‌-చెన్నై, నాగ్‌పూర్‌- బిలాస్‌పూర్‌, గోవా-ముంబయి, నాగ్‌పూర్‌-సికింద్రాబాద్‌ల మధ్య కూడా నడపాలని రైల్వే శాఖ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.

English summary
Imagine being ushered into a train by a hostess who presents you a rose bud as soft music plays in the background.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X