మహారాష్ట్రలో పట్టాలు తప్పిన రైలు: 12 మంది మృతి
ముంబై: మహారాష్ట్రలో ఘోర ప్రమాదం సంభవించింది. మహారాష్ట్రలోని రాయగఢ్ జిల్లాలో ఓ పాసింజర్ రైలు పట్టాలు తప్పింది. ఈ ఘటనలో పన్నెండు మంది మృతి చెందారు.
నాగ్ థానే - రోహా రైల్వే స్టేషన్ల మధ్య ఆదివారం ఉదయం పది గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో పన్నెండుమంది మృతి చెందగా, ఇరవై మందికి పైగా గాయపడ్డారు.

ప్రమాదానికి గురైన పాసింజర్ రైలు దివా - సమత్వాడీ. ఈ రైలు నది గ్రామ సమీపంలోని సొరంగం వద్దకు రాగా.. ఇంజిన్‌తో సహా నాలుగు బోగీలు పట్టాలు తప్పాయి. గాయపడ్డ వారిని దగ్గరలోని ఆశుపత్రికి తరలించారు.












Click it and Unblock the Notifications