పట్టాల పక్కనే ఏనుగు ప్రసవం- అప్పుడే ఊహకు అందని ఘటన
మానవ-వన్యప్రాణుల సహజీవనానికి అరుదైన, హృదయాన్ని హత్తుకునే ఉదాహరణ.. ఈ ఘటన. రైలు పట్టాల పక్కనే ప్రసవిస్తోన్న ఓ ఏనుగు కోసం మానవత్వాన్ని చాటుకున్నాడో లోకో పైలెట్. ఈ ఏనుగు సుఖంగా ప్రసవించడానికి వీలుగా ఏకంగా రెండు గంటలకు పైగా రైలును నిలిపివేశాడు. దానికి ఎటువంటి ఇబ్బందులు కలిగించలేదు.
ప్రసవ వేదనలో ఉన్న ఏనుగు పట్టాలకు ఆనుకునే ఉన్న సమయంలో.. రైలును పరుగులు తీయించడానికి ఆయనకు మనసొప్పలేదు. ఎంత సేపయినా సరే.. ఏనుగు ప్రసవించిన తరువాతే వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. కొందరు ప్రయాణికులు ఒత్తిడి తెస్తున్నప్పటికీ.. పట్టు సడలించలేదు. వారిని నచ్చజెప్పాడు.

దాదాపుగా రెండున్నర గంటల తరువాత ఏనుగు ప్రసవించింది. తన బిడ్డకు స్వాగతం ఈ ప్రపంపంలోకి స్వాగతం పలికింది. తల్లి- బిడ్డ సమీప అడవుల్లోకి క్షేమంగా వెళ్లిపోయిన తరువాతే.. ఆ లోకో పైలెట్ రైలును గమ్యస్థానం వైపు తీసుకెళ్లాడు. అప్పటి వరకూ ఒక్క అంగుళం కూడా కదలనివ్వలేదు.
దీనికి సంబంధించిన వీడియోను కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రి భూపేందర్ యాదవ్ తన ఎక్స్ లో పోస్ట్ చేశారు. ఈ వీడియో వైరల్ అయింది. ఆ లోకో పైలెట్ పై నెటిజన్లు ప్రశంసల వర్షాన్ని కురిపిస్తోన్నారు. ఆయనకు అవార్డులను ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
ఏనుగులను సంరక్షించడానికి 3,500 కిలోమీటర్ల రైలు పట్టాల వెంబడి 110కి పైగా సున్నితమైన ప్రాంతాలను గుర్తించారు రైల్వే, కేంద్ర అటవీ మంత్రిత్వ శాఖ అధికారులు. ఆయా ప్రాంతాల్లో ఏనుగులు సురక్షితంగా పట్టాలు దాటడానికి ప్రత్యేక చర్యలు చేపట్టారు. హారన్ మోగించడం, రైలును వేగంగా పోనివ్వడం వంటివి ఇందులో ఉన్నాయి.












Click it and Unblock the Notifications