రైలు ప్రయాణంలో ఇదొక్కటి తెలుసుకోండి!!
రైలు ప్రయాణం చేసేటప్పుడు మనం చాలా విషయాలను పట్టించుకోం. రైల్వే ట్రాక్‌లపై, క్రాసింగ్‌ల వద్ద రైల్వే కొన్ని బోర్డులను ఏర్పాటు చేస్తుంది. అలాంటి బోర్డులను సాధారణంగా చూస్తాంకానీ వాటిగురించి తెలుసుకోవడానికి ఆసక్తి చూపించం. రైల్వే ట్రాక్‌ల పక్కన, క్రాసింగ్ వల్ల W/L అని బోర్డులు ఏర్పాటు చేస్తారు. W/L అంటే విజిల్ / లెవెల్ బోర్డ్ అని అర్థం. ఇది ట్రాక్‌లకు రెండు వైపులా ఏర్పాటు చేస్తారు.
లోకో పైలట్‌ను అప్రమత్తం చేయడానికి రైల్వే ఈ బోర్డును ఏర్పాటు చేస్తుంది. ఈ బోర్డు దాటడానికి 600 మీటర్ల ముందు ఏర్పాటు చేసి ఉంటుంది. ఈ బోర్డు గుండా వెళ్లే సమయంలో లోకో పైలట్ హారన్ ఇవ్వడం తప్పనిసరి. బోర్డు దాటే వరకు నిరంతరాయంగా దాన్ని మోగించాల్సి ఉంటుంది. క్రాసింగ్‌ల వద్ద ప్రమాదాలు జరుగకుండా రైలు వస్తుంది అని తెలియజేయడానికే హారన్ ఇస్తారు. అందుకే ఈ W/L బోర్డులను ఏర్పాటు చేస్తారు. పసుపు రంగు బోర్డుపై నల్ల రంగుతో W/L అని రాయబడి ఉంటుంది. దూరం నుంచి చూసినా కనిపించేలా అలా రాస్తారు. ఈ బోర్డు చూసిన లోకో పైలట్ క్రాసింగ్ దగ్గర నిలబడినవారిని హారన్ కొడుతూ హెచ్చరించాలి. పైలట్ ను అప్రమత్తం చేయడానికే దీన్ని ఏర్పాటు చేస్తారు.
రైలు బోగీలపై ఐదు అంకెల నెంబర్ వేసివుంటుంది. దాన్ని రెండు భాగాలుగా విభజించుకోవాలి. మొదటి రెండు అంకెలు అది తయారుచేసిన సంవత్సరాన్ని సూచిస్తుంది. చివరి మూడు అంకెలు బోగీ వర్గాన్ని తెలియజేస్తాయి.

001-025 : ఏసీ ఫస్ట్ క్లాస్
026-050 : కాంపోజిట్
051-100 :1AC + AC-2T
101-150 : AC-2T
151-200 : AC-3T
201-400 :CC (AC చైర్ కార్) SL (2వ తరగతి Sleeper)
401-600 : GS (జనరల్ 2వ తరగతి)
601-700 : 2S (2వ తరగతి సిట్టింగ్/జన శతాబ్ది చైర్ క్లాస్)
701-800 : సిట్టింగ్ కమ్ లగేజ్ రేక్
801 + : ప్యాంట్రీ కార్, జనరేటర్, మెయిల్
ఉదాహరణకు 98450 అని బోగీపై ఉంటే 1998లో బోగీని తయారు చేశారని అర్థం. అలాగే చివరి మూడంకెలు జనరల్ తరగతిని సూచిస్తాయి.












Click it and Unblock the Notifications