దేశరాజధానితోపాటు ఐజ్వాల్, మిజోరాంలలో భూకంపం: జనం పరుగులు
దేశరాజధానితోపాటు ఐజ్వాల్, మిజోరాంలలో బుధవారం తెల్లవారుజామున స్వల్ప భూకంపం సంభవించింది.
న్యూఢిల్లీ: దేశరాజధానితోపాటు ఐజ్వాల్, మిజోరాంలలో బుధవారం తెల్లవారుజామున స్వల్ప భూకంపం సంభవించింది. న్యూఢిల్లీలో రిక్టారు స్కేలుపై భూకంప తీవ్రత న్యూఢిల్లీలో 3.0గా నమోదు కాగా, ఐజ్వాల్, మిజోరాంలలో 3.7గా నమోదైంది.

ఒక్కసారిగా భూప్రకంపనలు చోటు చేసుకోవడంతో ప్రభావిత ప్రాంతాల ప్రజలు నివాసాల నుంచి బయటికి పరుగులు తీశారు. ఎక్కడా ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం జరిగినట్లు సమాచారం లేదు.
కాగా, మంగళవారం పాకిస్థాన్‌లోని కరాచీ ప్రాంతంలో భూకంపం చోటు చేసుకుంది. అక్కడ భూకంప తీవ్రత 3.6గా నమోదైంది. ఇక్కడ కూడా ఎలాంటి ప్రాణ నష్టం జరిగినట్లు సమాచారం లేదు.












Click it and Unblock the Notifications