ఢిల్లీ, పరిసర ప్రాంతాల్లో భూకంపం.. 4.2 తీవ్రతతో ప్రకంపనాలు..
దేశ రాజధాని ఢిల్లీ, పరిసర ప్రాంతాలలో భూమి కంపించింది. నోయిడా, గురుగ్రామ్‌లో కూడా భూ ప్రకంపనాలు వచ్చాయి. భూకంప తీవ్రత 4.2గా ఉంది అని శాస్త్రవేత్తలు తెలిపారు. హర్యానాలో గల గురుగ్రామ్ నైరుతి దిశలో 48 కిలోమీటర్ల దూరంలో 7.5 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. గురువారం రాత్రి 11.46 గంటలకు భూమి కంపించిందని వారు తెలిపారు.

భూమి కంపించిందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ ధృవీకరించలేదు. కానీ ప్రసార భారతీ మాత్రం ఢిల్లీ భూ ప్రకంపనాలు వచ్చాయని ట్వీట్ చేసింది. ఘజియాబాద్‌లో కూడా భూమి కంపించిందని నెటిజన్లు ట్వీట్ చేశారు. భూ కంపానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ప్రాణ నష్టం ఏమీ జరగకపోవచ్చు.. కానీ ఆస్తి నష్టం జరిగేందుకు అవకాశం ఉంది.
Earthquake of magnitude 3.2 on the Richter scale hit Chuarachandpur in Manipur at 10:03 pm today: National Centre for Seismology pic.twitter.com/JDCg1MlUVZ
— ANI (@ANI) December 17, 2020












Click it and Unblock the Notifications