మానవత్వం మంటగలిపారు: ఆ యువకుడి హత్య, ఆపై సెల్ఫీలు..
తిరువనంతపురం: దొంగతనం చేశాడన్న ఆరోపణలతో మానసిక వైకల్యం ఉన్న ఓ గిరిజన యువకుడిపై తీవ్రంగా దాడి చేసి హత్య చేసిన ఘటన కేరళలోని పాలక్కడ్ జిల్లా అత్తపాడిలో చోటు చేసుకుంది.

మృతుడు స్థానిక గిరిజనుడు..
గురువారం నాడు చోటు చేసుకున్న ఈ ఘటనలో బాధితుడిని కదుకుమన్నకు చెందిన ఎ.మధుగా గుర్తించారు. అత్తపాడికి సమీపంలోని ఓ అడవిలో సాయంత్రం 4గం. సమయంలో మధు ఆ ప్రాంతంలో తిరగడం స్థానికులు గమనించారు.

దొంగతనం చేశాడని దాడి..
అంతకు మూడు రోజుల ముందు స్థానికంగా ఒకరి ఇంట్లో దొంగతనం జరిగింది. దీంతో ఆ దొంగతనం చేసింది మధునే అన్న అనుమానంతో అతనిపై దాడి కర్రలతో దాడి చేశారు.
దాడి అనంతరం పోలీసులకు అప్పగించగా.. జీపులో స్టేషనుకు తరలిస్తున్న క్రమంలో మధు కుప్పకూలిపోయాడు. దీంతో అతను చనిపోయినట్టుగా గుర్తించారు.

మానవత్వం మంటగలిసింది..
ఓ మానపసిక వైకల్యం ఉన్న వ్యక్తిపై అంత తీవ్రంగా దాడి జరుగుతుంటే.. కొంతమంది యువకులు అక్కడ సెల్ఫీలు దిగడం గమనార్హం. మానవత్వం ఉన్న సాటి మనుషులుగా దాడిని ఆపాల్సిందిపోయి సెల్ఫీల కోసం ఎగబడటం విచారకరం.

15మందిపై కేసు:
దాడికి పాల్పడిన 15మందిపై హత్యాయత్నం కేసు నమోదు చేశారు పోలీసులు. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. బాధితుడి మృతదేహాన్ని పోస్టుమార్టమ్ నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు.
-
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!!












Click it and Unblock the Notifications