వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎయిరిండియా సిబ్బందిపై టీఎంసీ ఎంపీ డోలాసేన్ దురుసు ప్రవర్తన

శివసేన ఎంపీ రవీంద్ర గైక్వాడ్ ఎయిరిండియా ఉద్యోగిపై దాడి చేసిన ఘటన ఉదంతంపై క్షమాపణ చెప్పిన 24 గంటల్లోనే మరో ఎంపి ఎయిరిండియా సిబ్బందిపై వీరంగం చేశారు.దీంతో విమానం అరగంట పాటు ఆలస్యమైంది.

By Narsimha
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: శివసేన ఎంపీ రవీంద్ర గైక్వాడ్ ఎయిరిండియా ఉద్యోగిపై దాడి చేసిన ఘటన ఉదంతంపై క్షమాపణ చెప్పిన 24 గంటల్లోనే మరో ఎంపి ఎయిరిండియా సిబ్బందిపై వీరంగం చేశారు.దీంతో విమానం అరగంట పాటు ఆలస్యమైంది.

తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి చెందిన రాజ్యసభ ఎంపీ డోలా సేన్ ఢిల్లీ నుండి కోల్ కతా వెళ్ళే ఎయిరిండియా విమానాన్ని శుక్రవారం నాడు ఎక్కారు.డోలా సేన్ తన తల్లిని అత్యవసర ద్వారం వద్ద కూర్చోబెట్టారు.

dola sen

అయితే ఎయిరిండియా సిబ్బంది మాత్రం అత్యవసర ద్వారం వద్ద డోలాసేన్ తల్లిని కూర్చోబెట్టకూడదని వేరే చసీటును కేటాయిస్తామని చెప్పారు.అయితే ఈ విషయమై ఆమె ఎయిరిండియా సిబ్బందితో వాగ్వాదానికి దిగారు.

ఎయిరిండియా సిబ్బందితో ఆమె గొడవ పడడం వల్ల సుమారు 30 నిమిషాల పాటు విమానం ఆలస్యమైంది.అయితే శివసేన ఎంపి రవీంద్ర గైక్వాడ్ ఎయిరిండియా సిబ్బందిపై దాడికి క్షమాపణ చెప్పిన 24 గంటల్లోనే అదే తరహాలో మరో ఘటన చోటుచేసుకోవడం గమనార్హం.

English summary
Trinamool MP Dola Sen creates ruckus, delays Air India flight from Delhi to Kolkata by 30 minutes After the Shiv Sena MP, it is now the turn of TMC Rajya Sabha MP who refused to abide by the security protocol thus delaying the Delhi-Kolkata flight by 30 minutes.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X