ఢిల్లీలో మాంసం దుకాణాల నిషేధంపై తృణమూల్ ఎంపీ మహువా మొయిత్రా ఆగ్రహం
హిందువుల పండుగ నవరాత్రి సందర్భంగా ఢిల్లీలోని వివిధ ప్రాంతాల్లో మాంసం దుకాణాలపై నిషేధం విధించడాన్ని ఇప్పటికే అనేక ప్రతిపక్ష పార్టీలు తప్పు పడుతున్నాయి. తాజాగా తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మోయిత్రా మాంసం దుకాణాలపై నిషేధం విధించటాన్ని తీవ్రంగా తప్పుబట్టారు.
తనకు నచ్చినప్పుడల్లా మాంసం తినే స్వేచ్చ ఉందన్న మహువా మొయిత్రా
రాజ్యాంగం ద్వారా భారత పౌరులకు హామీ ఇచ్చిన స్వేచ్ఛను ప్రస్తావిస్తూ, ఆమె తనకు నచ్చినప్పుడల్లా మాంసం తినడానికి స్వేచ్ఛ ఉందని, మాంసం విక్రయించే దుకాణదారులకు వారి వ్యాపారాన్ని నిర్వహించుకునే స్వేచ్ఛను కూడా రాజ్యాంగం అనుమతిస్తుంది అని ఆమె పేర్కొన్నారు. తాను దక్షిణ ఢిల్లీలో ఉంటున్నానని వెల్లడించిన మహువా మోయిత్రా దక్షిణ ఢిల్లీ నగర మేయర్ తీసుకున్న నిర్ణయాన్ని తీవ్రంగా ఆక్షేపించారు. మాంసం నిషేధం నిర్ణయానికి ఫుల్ స్టాప్ పెట్టాల్సిన అవసరం ఉందన్నారు. సోషల్ మీడియా వేదికగా ఆమె తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

నవరాత్రుల సందర్భంగా మాంసం దుకాణాలను మూసెయ్యాలని ఆదేశించిన దక్షిణ ఢిల్లీ మేయర్
సోమవారం, దక్షిణ ఢిల్లీ మేయర్ ముఖేష్ సూర్యన్ దుర్గా దేవికి అంకితమైన నవరాత్రుల పవిత్రమైన కాలంలో తన నగరపాలక సంస్థ క్రింద ఉన్న మాంసం దుకాణాలను మూసివేయాలని ప్రకటించారు. ఈ తొమ్మిది రోజులలో భక్తులు మాంసం, ఉల్లిపాయలు మరియు వెల్లుల్లి తినకూడదని తెలిపారు. ఫిర్యాదుల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నామని, ఇది ఎవరి స్వేచ్ఛకు భంగం కలిగించదని ఆయన పేర్కొన్నారు.

తాము తీసుకున్న నిర్ణయాన్ని సమర్ధించుకున్న దక్షిణ ఢిల్లీ మేయర్
తాము అన్ని మాంసం దుకాణాలను ఖచ్చితంగా మూసివేస్తామని, మాంసం విక్రయించనప్పుడు, ప్రజలు దానిని తినరని దక్షిణ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ పేర్కొన్నారు.పవిత్ర రంజాన్ మాసంలో కొన్ని ఇస్లామిక్ దేశాలలో బహిరంగంగా నీరు త్రాగడం నిషేధించబడిన ఉత్తర్వును దక్షిణ ఢిల్లీ మేయర్ సమర్ధించారు. ఢిల్లీవాసులు మనోభావాలను దృష్టిలో ఉంచుకుని తాము నిర్ణయం తీసుకున్నామని ఆయన పేర్కొన్నారు. ఇది ఎవరి వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగించదని సూర్యన్ వెల్లడించారు.

భయంతో మాంసం దుకాణాలను మూసివేస్తున్న వ్యాపారులు
అయితే మాస విక్రయాలపై నిషేధం విధించినా ఇప్పటివరకు సంబంధిత శాఖ నుంచి ఎలాంటి అధికారిక ఉత్తర్వులు వెలువడలేదు. బ్యాన్ నిర్ణయం తరువాత, జాతీయ రాజధానిలో అనేక మాంసం దుకాణ యజమానులు అధికారుల చర్యకు భయపడి స్వచ్ఛందంగా తమ మాంసం దుకాణాలను మూసి వేస్తున్నారు. ఏమైనా దక్షిణ ఢిల్లీ మేయర్ చేసిన మాంసం విక్రయాలపై నిషేధం ప్రకటన రాజకీయంగా ప్రతిపక్ష పార్టీల ఆగ్రహానికి కారణంగా మారింది.












Click it and Unblock the Notifications