ట్రిపుల్ తలాక్ పై ముస్లిం మహిళ సంచలనం, మోడీపై ప్రశంసలు

Posted By:
Subscribe to Oneindia Telugu

డెహ్రడూన్:ట్రిపుల్ తలాక్ పై ముమ్మరంగా చర్చ సాగుతున్న సమయంలోనే ఓ ముస్లిం మహిళ సంచలన నిర్ణయం తీసుకొన్నారు.ట్రిపుల్ తలాక్ ఆచారం వల్ల బాధితులౌతున్న వారి జీవితాల్లో మార్పు తెచ్చేందుకుగాను ప్రధానమంత్రి నరేంద్రమోడీ చేస్తున్న కృషిని ఆమె ప్రశంసించారు.

ఉత్తరాఖండ్ లోని కిచ్చా ప్రాంతానికి చెందిన ఓ ముస్లిం మహిళ ట్రిపుల్ తలాక్ విధానంపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.హిందూ మతంలోకి మారితే పురుషులు మూడుసార్లు తలాక్ చెప్పి విడాకులు ఇవ్వలేరన్నారు. తన సోదరి ట్రిపుల్ తలాక్ బాధితురాలని ఆమె చెప్పారు.

triple talaq

కేవలం మూడుసార్లు తలాక్ అని చెప్పి, జీవితంలో ఎప్పుడైనా భార్యను వదిలేయడానికి అవకాశం ఉన్నప్పడు ఆ వ్యక్తితో జీవితాన్ని గడపడం వల్ల ఉపయోగమేమిటని ఆమె ప్రశ్నించారు. ప్రస్తుతం తాను యుక్త వయస్సులో ఉన్నానన్నారు.

ట్రిపుల్ తలాక్ గురించి తాను భయపడుతూనే మొత్తం జీవితాన్ని ఎందుకు గడపాలని ఆమె ప్రశ్నించారు. హిందూ మతంలోకి మారి ఓ హిందువును పెళ్ళి చేసుకొంటే కనీసం మూడు మాటలు చెప్పి తన జీవితాన్ని నాశనం చేయకుండా ఉంటాడనే భరోసా ఉంటుందన్నారామె.

ప్రధానమంత్రి మోడీని ప్రశంసించారు. దేశం కోసం మోడీ చేసే పనులు మంచిగా ఉన్నాయన్నారు.అయితే మహిళల కోసం ముఖ్యమంగా ముస్లిం మహిళల కోసం ఆయన చేస్తున్నది చాలా బాగుందన్నారు. ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్ కూడ ఆమెను ప్రశంసించారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Amid raging debate over the issue of triple talaq, a Muslim woman has hailed Prime Minister Narendra Modi's efforts to bring change for the sufferers of the practice.The Uttarakhand woman further said it was better to convert and adopt Hinduism than to face injustice due to triple talaq system.
Please Wait while comments are loading...