సిపిఎం నేత నిర్వాకం: నోట్ల కట్టలపై నిద్రించాడు
అగర్తాల: నోట్ల కట్టలపై పడుకుని నిద్రిస్తూ సిపిఎం నాయకుడొకతను పట్టుబడ్డాడు. దీంతో పార్టీ నుంచి అతను బహిష్కరణకు గురయ్యాడు. అనైతికమైన పనికి పాల్పడినందుకు, పార్టీ ప్రతిష్టను దెబ్బ తీసినందుకు పార్టీ అతన్ని బహిష్కరించింది.
త్రిపురలోని సిపిఎం బ్యాంకుమారి స్థానిక కమిటీ సభ్యుడైన సమర్ అచార్జీ చర్యపై తీవ్రంగా ప్రతిస్పందించింది. అక్రమ పద్ధతుల్లో అతను డబ్బులు సంపాదిస్తున్నట్లు దుక్లీ డివిజనల్ కమిటీ కార్యదర్శి సుబ్రతా చక్రవర్తి చెప్పారు.

తమ కమిటీ సమావేశంలో సమర్ ఆచార్జీని బహిష్కరించాలని నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు. వృత్తి రీత్యా ఆచార్జీ కాంట్రాక్టర్. అతను నోట్ల కట్టలపై పడుకున్న దృశ్యాన్ని గత గురువారం టెలివిజన్ ఫుటేజీలో బయటపడింది.
తాను బ్యాంక్ నుంచి 20 లక్షల రూపాయలు డ్రా చేశానని, నోట్ల కట్టలపై పడుకోవాలనే తన కలను సాకారం చేసుకున్నానని ఫుటేజీ గురించి విన్న తర్వాత అచార్జీ అన్నాడు. మిగతా నాయకుల మాదిరి తాను హిపోక్రట్‌ను కానని, పెద్ద యెత్తున డబ్పులు కూడబెట్టి కూడా శ్రామికులమని చెప్పుకుంటారని ఆయన అన్నాడు. గత అక్టోబర్ 10వ తేదీన తనకు డివిజనల్ కమిటీ నోటీసు ఇచ్చిందని, తాను ఇచ్చిన సమాధానంతో పార్టీ సంతృప్తి చెందలేదని ఆయన అన్నాడు.
<center><center><center><iframe width="100%" height="360" src="//www.youtube.com/embed/sRn4opccFno?feature=player_detailpage" frameborder="0" allowfullscreen></iframe></center></center></center>












Click it and Unblock the Notifications