బాణాసంచా నిషేధం: సుప్రీం తీర్పుపై గవర్నర్ సంచలన వ్యాఖ్యలు

Subscribe to Oneindia Telugu

కోల్‌కతా: కాలుష్యం పెరిగిపోతున్న నేపథ్యంలో దేశ రాజధాని ఢిల్లీలో, ఎన్సీఆర్‌లో బాణాసంచా అమ్మకాలను నిషేధిస్తూ సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చిన విషయం తెలిసిందే. కాగా, సుప్రీం ఆదేశాలను తప్పుబడుతూ త్రిపుర గవర్నర్‌ తథాగత్‌ రాయ్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు.

'మొదట ఉట్టి (దహీఅండీ) వేడుకలు, ఇప్పుడు పటాకులు.. రేపు హిందూ దహన సంస్కారాలనూ నిషేధిస్తారేమో.. కొవ్వొత్తులతో నిరసన తెలిపే ఈ అవార్డు వాపసీ గ్యాంగ్‌ హిందూ దహన సంస్కారాల వల్ల వాయుకాలుష్యం ఏర్పడుతుందని కోర్టులో పిటిషన్‌ వేస్తుందేమో' అని తథాగత్‌ రాయ్‌ ట్వీట్‌ చేశారు.

కాగా, ఒకప్పటి బీజేపీ సీనియర్‌ నేత అయిన తథాగత్‌ రాయ్‌ ట్వీట్‌పై దుమారం రేగుతోంది. అయితే, దీపావళి సందర్భంగా బాణాసంచా అమ్మకాలను నిషేధించడం తనను అసంతృప్తికి గురిచేసిందని, హిందువుల పండుగ చేసుకునే హక్కును ఇది దూరం చేస్తుందనే భావనతోనే ఈ వ్యాఖ్య చేసినట్టు ఆయన మీడియాకు చెప్పారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Adding to the growing social media clamour over the Supreme Court ban on sale of firecrackers in Delhi and NCR this Diwali, Tripura Governor Tathagata Roy has sparked a fresh controversy with a veiled attack on the court ruling.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి