Jharkhand Polls: హేమంత్ సోరెన్ కు మరో షాక్- మోడీ దూతల ఎంట్రీ...!

జార్ఖండ్ లో అసెంబ్లీ ఎన్నికల వేళ కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. రాష్ట్రంలో ఓవైపు ఎన్నికల ప్రచారం ముమ్మరంగా సాగుతుండగా.. మరోవైపు సీఎం హేమంత్ సోరెన్ ను టార్గెట్ చేస్తూ కేంద్రం దాడులకు దిగింది. ఆదాయపు పన్ను శాఖ ఇవాళ రాష్ట్రంలోని 16-17 ప్రాంతాల్లో దాడులు నిర్వహిస్తోంది. హేమంత్ వ్యక్తిగత సలహాదారు, ఆయన సన్నిహితుల ఆస్తులే లక్ష్యంగా ఈ దాడులు జరుగుతున్నాయి.

హేమంత్ సోరెన్ వ్యక్తిగత సలహాదారు సునీల్ శ్రీవాస్తవ, అతనితో సంబంధం ఉన్న పలువురు వ్యక్తులపై ఆదాయపు పన్ను శాఖ ఇవాళ దాడులు నిర్వహించింది. శ్రీవాస్తవ కుటుంబ సభ్యులు, సన్నిహితుల ఇళ్లతో సహా ఆయనకు సంబంధించిన 16-17 ప్రాంతాల్లో ఈ దాడులు జరిగాయి. జంషెడ్‌పూర్‌లోని అంజనియా స్టీల్, ఇతర సంస్థల ప్రాంగణాలతో సహా రాంచీలోని ఏడు , జంషెడ్‌పూర్‌లోని తొమ్మిది ప్రాంతాల్లో ఈ దాడులు జరుగుతున్నాయి.

trouble mounts for Hemanth soren ahead of Jharkhand polls as it raids on personal advisor

పన్ను ఎగవేత ఆరోపణలపై ఆదాయపు పన్ను శాఖ ఈ దాడులు చేస్తున్నట్లు తెలుుస్తోంది. పన్ను చెల్లింపులకు సంబంధించి శ్రీవాస్తవ కొన్ని అక్రమాలకు పాల్పడ్డారని అందిన సమాచారం మేరకు ఈ దాడులు జరుగుతున్నాయని సమాచారం. శ్రీవాస్తవపై ఆదాయపు పన్ను శాఖ దాడులపై అధికార కూటమిలోని కాంగ్రెస్ స్పందించింది. రాష్ట్రంలో ఎన్నికల్ని ప్రభావితం చేసేందుకు బీజేపీ ఉద్దేశపూర్వకంగా ఐటీ శాఖతో ఈ దాడులు చేయిస్తోందని విమర్శించింది. ఇలాంటి చర్యలతో ప్రతిపక్ష నేతలపై ఒత్తిడి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారని కాంగ్రెస్ నేత రాకేష్ సిన్హా అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+