టిఆర్ఎస్ నేతలు రాష్ట్రంలో ఎక్కడ కనిపించినా కోడిగుడ్లు,రాళ్లు,కర్రలతో కొట్టాలి.!రేవంత్ అనూహ్య పిలుపు.!

ఢిల్లీ/హైదరాబాద్ : టీఆర్ఎస్ ఎంపీలపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు నేసారు. గులాబీ నాయకులు రాష్ట్రంలో ఎక్కడ కనిపించినా ప్రతిఘటించాలని పిలునిచ్చారు. పార్లమెంట్ లో గత వారం రోజుల నుంచి టీఆర్ఎస్ ఎంపీలు నాటకాలు ఆడారని, నిన్ను తాను చెప్పిన విధంగానే ఈ రోజు టీఆర్ఎస్ ఎంపీలు సభనుంచి వెళ్లిపోయారని గుర్తు చేసారు రేవంత్ రెడ్డి. పార్లమెంటు శీతాకాల సమావేశాలు బైకాట్ చేస్తారని తాను నిన్న చెప్పానని, ప్రధాని మోడీ, చంద్రశేఖర్ రావుల మధ్య జరిగిన ఒప్పందం ప్రకారమే వాళ్ళు వాకౌట్ చేశారని రేవంత్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేసారు.

 ఢిల్లీలో అగ్గిపుట్టిస్తానని కేసీఆర్ ప్రగల్బాలు.. సీఎం ఫాం హౌస్ లో పెగ్గేస్తున్నాడని రేవంత్ ఎద్దేవా

ఢిల్లీలో అగ్గిపుట్టిస్తానని కేసీఆర్ ప్రగల్బాలు.. సీఎం ఫాం హౌస్ లో పెగ్గేస్తున్నాడని రేవంత్ ఎద్దేవా

ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు గత ఢిల్లీ పర్యటనలో ఢిల్లీ పెద్దల పైన దండయాత్ర చేస్తానని, అగ్గిపుట్టిస్తానని ప్రగల్బాలు పలికి, ఫామ్ హౌస్ లో పెగ్గు తాగి పడుకున్నాడని రేవంత్ రెడ్డి ఎద్దేవా చేసారు. గత రెండు నెలల నుంచి రైతులు రాష్ట్రంలో అష్టకష్టాలు పడుతున్నారని, రోజు 4, 5 మంది రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారని రేవంత్ ఆవేదన వ్యక్తం చేసారు. ఢిల్లీ పర్యటలో చంద్రవేఖర్ రావు ఏం చేశారో తెలంగాణ ప్రజలకు ఇప్పటివరకు చెప్పలేదని మండిపడ్డారు.

 కేసీఆర్ ఢిల్లీలో ఏంచేసారు.. రైతుల సందేహాలు నివృత్తి చేయాలన్న రేవంత్ రెడ్డి

కేసీఆర్ ఢిల్లీలో ఏంచేసారు.. రైతుల సందేహాలు నివృత్తి చేయాలన్న రేవంత్ రెడ్డి

తెలంగాణలో వరి ధాన్యం కొనుగోలు సమస్య తీరిందా.? కేంద్రం ఏమైనా నిర్ణయం తీసుకుందా.?ఏదైనా హామీ ఇచ్చిందా.? అనే అంశాల పట్ల తెలంగాణ రైతాంగానికి అనేక సందేహాలున్నాయని అన్నారు. ఎందుకు శీతాకాల సమావేశాలను ఎంపీలు వాకౌట్ చేశారని, ఢిల్లీ నుంచి గల్లీ కి ఎందుకు తిరుగు ప్రయాణమయ్యారని, శీతాకాల సమావేశాల్లో ఢిల్లీ పెద్దల మెడలు వంచుతాం అని ఇప్పుడు గల్లీ బాట పట్టారని రేవంత్ ఎద్దేవా చేసారు. చనిపోయిన రైతు కుటుంబాలకు 25 లక్షలు నష్టపరిహారం ప్రకటించాలని ప్రతిపక్షాలు పార్లమెంటులో డిమాండ్ చేశాయని, ప్రతిపక్షాలు వాయిస్ పక్కదోవ పట్టించేందుకు టీఆర్ఎస్ ఎంపీలు పోడియం చుట్టూ ఆందోళన చేశారని రేవంత్ ధ్వజమెత్తారు.

 కోట్ల విలువైన భూముల వ్యవహారంలో కేసీఆర్ ప్రమేయం.. ఈడికి దొరకకుండా అనేక ప్రయత్నాలన్న రేవంత్

కోట్ల విలువైన భూముల వ్యవహారంలో కేసీఆర్ ప్రమేయం.. ఈడికి దొరకకుండా అనేక ప్రయత్నాలన్న రేవంత్

ఈడిలకు, బిడిలకు భయపడను అని చెప్పిన చంద్రశేఖర్ రావు ఇప్పుడు ఎందుకు కేంద్రానికి భయపడుతున్నారని, హైదరాబాదు శివార్లలో మూడు వేల కోట్ల విలువైన భూముల విషయంలో చంద్రశేఖర్ రావు సన్నిహితులకు ఈడీ నోటీసులు ఇచ్చిందని, వారందరినీ పిలిచి విచారించిందని రేవంత్ స్పష్టం చేసారు.ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ లో 15 సంవత్సరాల క్రితం విదేశీ కంపెనీలకు 450 కోట్లకు ఈ భూములను అప్పట్లో అప్పటి ప్రభుత్వం కట్టబెట్టిందని, కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత వారి నుంచి బలవంతంగా 350 కోట్లకు కొనుగోలు చేశారని రేవంత్ తెలిపారు. హైదరాబాద్ కు చెందిన పెద్ద రియల్ ఎస్టేట్ కాంట్రాక్టర్, టివి యజమానికి ఈ భూములు కట్టబెట్టారని తీవ్ర ఆరోపణలు చేసారు.

 టీఆర్ఎస్ అక్రమ భూదందాలు.. ఈడి విచారణ తప్పించుకునేందుకే వాకౌట్ డ్రామా అన్న రేవంత్

టీఆర్ఎస్ అక్రమ భూదందాలు.. ఈడి విచారణ తప్పించుకునేందుకే వాకౌట్ డ్రామా అన్న రేవంత్

చంద్రశేఖర్ రావు మంత్రిగా ఉన్నప్పుడే ఈ వ్యవహారం జరిగిందని, హెచ్ఎండిఏ సంబంధించిన పరిధిని అంతా అప్పట్లో కేటీఆర్ సంబంధించిన మంత్రి ఆధ్వర్యంలో జరిగిందని, ఈడి కేసులను నుంచి తప్పించుకునేందుకే చంద్రశేఖర్ రావు పార్లమెంట్ లో ఎంపీలను ఆందోళన చేయమని చెప్పారని రేవంత్ ఆరోపించారు.భూముల వ్యవహారంలో కేటీఆర్ ని ఈడి పిలిపించాలని చూసింది కానీ చివరి నిమిషంలో వాయిదా వేసుకున్నారని అన్నారు. భూముల అక్రమాలలో మంత్రి కేటీఆర్ సంతకం చేశారని, బిజెపి కేటీఆర్ పై కేసులు తాత్కాలికంగా వాయిదా వేయడం వల్లనే పార్లమెంట్ నుండి వాకౌట్ చేశారని అన్నారు. రాజకీయ ఒడంబడికల భాగంగానే టిఆర్ఎస్ బిజెపిలో ఇలాంటి కార్యక్రమాలు జరుగుతున్నాయన్నారు. టిఆర్ఎస్ నాయకులు రాష్ట్రంలో ఎక్కడ కనిపించినా కోడిగుడ్లు, రాళ్లు , కర్రలతో కొట్టాలని రేవంత్ పిలుపునిచ్చారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+