పోలవరం ఆర్డినెన్స్‌పై లోకసభలో తెరాస పోరు, స్లోగన్స్

న్యూఢిల్లీ: లోకసభలో సోమవారం పోలవరం ఆర్డినెన్స్ ప్రకంపనలు సృష్టించింది. తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) సభ్యులు పోలవరం ఆర్డినెన్స్‌ను వ్యతిరేకిస్తూ వెల్‌లో దూసుకెళ్లారు. బిజెడి సభ్యులు కూడా వారితో గొంతు కలిపారు. ప్రాజెక్టును వ్యతిరేకిస్తూ తెరాస సభ్యులు ప్లకార్డులు ప్రదర్సించారు.

పోలవరం ప్రాజెక్టు అర్డినెన్స్ గిరిజనుల మనోభావాలను దెబ్బ తీస్తుందని తెరాస సభ్యులు విమర్శించారు. నినాదాలు చేయకూడదని స్పీకర్ సుమిత్రా మహాజన్ చెప్పినా వారు వినిపించుకోలేదు. ప్రవర్తన సరైంది కాదని, ఆర్డినెన్స్‌ స్థానంలో బిల్లును ప్రతిపాదించినప్పుడు ఆ అంశాన్ని లేవనెత్తవచ్చునని సుమిత్రా మహాజన్ తెరాస సభ్యులతో చెప్పారు.

TRS MPs oppose Polavaram ordinance in LS

"దయచేసి సీట్లలోకి వెళ్లండి. ఇది సరైంది కాదు, ఇది సమయం కాదు. ఆర్డినెన్స్‌పై చర్చ వచ్చినప్పుడు మీరు అంశాన్ని లేవనెత్తవచ్చు. మీకు పద్ధతి తెలుసు.. ఆ సమయంలో చర్చకు నేను అనుమతిస్తాను. ఈ పద్ధతిలో కాదు" అని ఆమె ఆందోళనకు దిగిన సభ్యులతో అన్నారు.

ఏమీ వినిపించకడపోవడంతో బిజెడి సభ్యుడు బి మహతాబ్ పాయింట్ ఆఫ్ ఆర్డర్ లేవనెత్తారు. సభను స్పీకర్ వాయిదా వేశారు. పోలవరం ఆర్డినెన్స్‌ను తాము పూర్తి స్థాయిలో వ్యతిరేకిస్తున్నట్లు తెరాస సభ్యుడు ఎంపి జితేందర్ రెడ్డి చెప్పారు. ఆర్డినెన్స్‌ను బిల్లు రూపంలో తేవాలనుకుంటున్న ప్రభుత్వం ప్రయత్నాన్ని అడ్డుకుంటామని ఆయన చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+