సంచలనం: 'ట్రంప్‌పై ఉగ్రవాదుల గురి, వైట్ హౌజ్ సేఫ్ కాదు,'

Subscribe to Oneindia Telugu

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సెక్యూరిటీపై అనుమానాలు తలెత్తుతున్నాయి. అధికారిక నివాసం వైట్ హౌజ్ ఆయనకు సురక్షితం కాదని సీక్రెట్ సర్వీస్ మాజీ ఏజెంట్ డాన్‌ బోంగినో సంచలన వ్యాఖ్యలు చేశారు. వైట్ హౌజ్ లో ట్రంప్ కు ఏమాత్రం సురక్షితం కాదని, ఉగ్రవాద దాడి జరిగితే చివరికి సీక్రెట్ సర్వీస్ కూడా ఆయనను కాపాడలేదని అన్నారు.

వైట్ హౌజ్ ప్రాంగణంలో ఇటీవల ఓ అనుమానితుడు తచ్చాడటం ఈ అనుమానాలకు తావిచ్చింది. వైట్ హౌజ్ గోడ దూకిన ఓ గుర్తు తెలియని వ్యక్తి దాదాపు 15నిమిషాల పాటు ఆ ప్రాంగణంలో అటు ఇటు తిరిగాడు. ఆ సమయంలో అక్కడ అత్యధిక భద్రత ఉండటం గమనార్హం. అంతమంది భద్రత ఉన్నా అతను ఏమాత్రం భయం లేకుండా లోపలికి చొరబడ్డాడు.

అయితే భద్రతా సిబ్బంది అతన్ని అరెస్టు చేయడంతో అది అక్కడికి ముగిసిపోయింది. గోడ దూకిన వ్యక్తిని కాలిఫోర్నియాకు చెందిన జొనాథన్‌ టీ ట్రాన్‌(26)గా గుర్తించినట్లు సీక్రెట్‌ సర్వీస్‌ తెలిపింది. రాత్రి 11.21గం. సమయంలో అతను లోపలికి ప్రవేశించగా 11.38కి పోలీసులు అరెస్ట్‌ చేశారు.

Trump is not safe in the White House anymore! Here's what needs to be done NOW

కాగా ట్రంప్ కు వైట్ హౌజ్ సురక్షితం కాదంటూ తాజాగా వ్యాఖ్యలు చేసిన డాన్ బోంగినో గతంలో మాజీ అధ్యక్షులు బరాక్‌ ఒబామా, జార్జ్‌ డబ్లు్య బుష్‌లకు భద్రత సిబ్బందిగా పనిచేశారు. అధ్యక్షుడికి రక్షణ కల్పించాల్సిన బాధ్యత సీక్రెట్ స్వీస్ ఏజెంట్ పై ఉన్నప్పటికీ.. వారికి సరైన సిబ్బంది లేరని ఆయన గుర్తుచేశారు.

ఈ నేపథ్యంలో ఒకవేళ ట్రంప్ పై ఉగ్రవాద దాడి జరిగితే కాపాడలేరని అన్నారు. ఒకేసారి ఓ 40మంది ఉగ్రవాదులు దాడికి తెగబడితే ఏంచేస్తారని ప్రశ్నించారు. 'నన్ను నమ్మండి.. ఉగ్రవాదులు ఇప్పటికే ఆ ఆలోచనలో ఉన్నారు' అని పేర్కొంటూ తన వ్యాఖ్యలను డాన్ బోంగినో పట్టించుకోవాలని సూచించారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Having been a former Secret Service agent, guys and ladies out there, he’s just not safe anymore. And I’m very careful about hyperbolic or overly dramatic statements for effect.
Please Wait while comments are loading...