ప్రకాష్ రాజ్ ను అడ్డుకున్న బీజేపీ, భజరంగ దళ్: అవార్డు తీసుకోవడానికి వస్తే నల్లజెండాలతో !

Posted By:
Subscribe to Oneindia Telugu

బెంగళూరు: బహుబాష నటుడు ప్రకాష్ రాజ్ కు నిరసన సెగ ఎదురైయ్యింది. కర్ణాటకలో ప్రసిద్ధి చెందిన డాక్టర్ కారంత అవార్డు అందుకోవడానికి మంగళవారం ప్రకాష్ రాజ్ రావడంతో బీజేపీ యువమోర్చ, భజరంగ దళ్, వివిధ హిందూ సంఘ, సంస్థలు నిరసన వ్యక్తం చేశాయి.

అవార్డు కార్యక్రమం నిర్వహిస్తున్న ఫక్షన్ హాల్ లోకి చోచ్చుకు వెళ్లడానికి ప్రయత్నించిన వందల మంది కార్యాకర్తలను పోలీసులు అరెస్టు చేశారు. మంగళవారం ప్రకాష్ రాజ్ మంగళూరు చేరుకుని అక్కడి నుంచి రోడ్డు మార్గంలో ఉడిపి మీదుగా కోటాదత్త ప్రాంతంలో జరుగుతున్న కార్యక్రమానికి బయలుదేరారు.

 Trying to disrupt DR Karanth award police detains BJP activists in Udupi

ఉడిపి చేరుకున్న ప్రకాష్ రాజ్ కు ఆయన అభిమానులు డాక్టర్ కారంత అవార్డు కార్యక్రమం ఏర్పాటు చేసిన నిర్వహకులు బాణసంచా కాల్చి స్వాగతం పలికారు. అదే సమయంలో రోడ్డుకు ఇరువైపుల నుంచి బీజేపీ, భజరంగ దళ్, వివిధ హిందూ సంఘ సంస్థల కార్యాకర్తలు నల్ల జెండాలు చేతపట్టుకుని నిరసన వ్యక్తం చేశారు.

డాక్టర్ కారంత అవార్డు తీసుకోవడానికి ప్రకాష్ రాజ్ అనర్హుడని నినాదాలు చేశారు. ఆ సందర్బంలో ప్రకాష్ రాజ్ ను ముట్టడించడానికి ప్రయత్నించడంతో నిరసనకారులను పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులు, నిరసనకారుల మధ్య వాగ్వివాదం జరిగింది.

బీజేపీ, భజరంగ దళ్ తో సహ హిందూ సంఘ, సంస్థలకు చెందిన కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు. 8 పోలీసు వాహనాల కాన్వాయ్ తో ప్రకాష్ రాజ్ కు గట్టిబందోబస్తు ఏర్పాటు చేసి కార్యాక్రమం జరుగుతున్న ప్రాంతానికి తరిలించారు. ప్రధాని నరేంద్ర మోడీ, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్ లపై ఇటీవల ప్రకాష్ రాజ్ వివాదాస్పద వ్యాఖ్యలు చెయ్యడంతో ఆయన మీద బీజేపీ నాయకులు, కార్యకర్తలు మండిపడుతున్నారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Activists belonging to BJP and several other organisations have tried to disrupt the ‘Dr. Shivarama Karanth Huttura Prashasti’ program. All the activists are detained by the police.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి