కొత్త ఉప ముఖ్యమంత్రిగా: ప్రతిపాదనలను ఆమోదించిన ఖర్గే

రాయ్‌పూర్: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన ఊపులో ఉంది కాంగ్రెస్ పార్టీ. అదే జోరును తెలంగాణ సహా ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొనబోయే రాష్ట్రాల్లోనూ కొనసాగించాలనే పట్టుదలను ప్రదర్శిస్తోంది. దీనికి అనుగుణంగా భవిష్యత్ కార్యాచరణ ప్రణాళికను రూపొందించుకుంటోంది. వాటిని అంతే పక్కాగా ఎగ్జిక్యూట్ చేయడానికి అవసరమైన సంప్రదింపులు జరుపుతోంది.

ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొనబోతోన్న రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్‌లల్లో అధికారాన్ని నిలబెట్టుకోవడంతో పాటు తెలంగాణ, మధ్యప్రదేశ్, మిజోరంలల్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన కసరత్తును కూడా కాంగ్రెస్ మొదలుపెట్టింది. దీనితో కాంగ్రెస్ పార్టీలో ఎన్నికల హడావుడి నెలకొంది. అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యాలయంలో వరుస భేటీలు ఏర్పాటవుతున్నాయి.

TS Singh Deo

ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ సహా పలువురు సీనియర్ నాయకులు ఈ అయిదు రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచార సమరశంఖాన్ని పూరించడానికి సన్నద్ధమౌతోన్నారు. త్వరలో ఆయా రాష్ట్రాల్లో పర్యటించడానికి సన్నద్ధమౌతోన్నారు. జూలై 2వ తేదీన ఖమ్మంలో నిర్వహించిన జన గర్జన సభలో పాల్గొనబోతోన్న రాహుల్ గాంధీ.. పొరుగునే ఉన్న ఛత్తీస్‌గఢ్‌కూ వెళ్లనున్నారు.

రాయ్‌పూర్‌‌‌లో బహిరంగ సభను ఉద్దేశించి ఆయన ప్రసంగించనున్నారు. ఛత్తీస్‌గఢ్‌లో వరుసగా రెండోసారి అధికారంలోకి రావడానికి అవసరమైన చర్యలను తీసుకుంటోంది కాంగ్రెస్. ఇందులో భాగంగా ఆ రాష్ట్రానికి కొత్తగా ఉప ముఖ్యమంత్రిని అపాయింట్ చేసింది. కొద్దిసేపటి కిందటే ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్.. దీనికి సంబంధించిన సమాచారాన్ని తన అధికారిక ట్విట్టర్ అకౌంట్‌లో పోస్ట్ చేశారు.

Kharge

సీనియర్ నాయకుడు టీఎస్ సింగ్ దేవ్‌ను ఉప ముఖ్యమంత్రిగా అపాయింట్ చేసినట్లు వెల్లడించారు. ఆయనకు అభినందనలు తెలియజేశారు. సింగ్ దేవ్‌ను డిప్యూటీ సీఎంగా అపాయింట్ చేయడానికి ఉద్దేశించిన ప్రతిపాదనలను మల్లికార్జున ఖర్గే ఆమోదించారు. ఆ వెంటనే దీనికి సంబంధించిన జీఓ విడుదలైంది.

టీఎస్ సింగ్ దేవ్ సొంత నియోజకవర్గం అంబికాపూర్. 2008,2013, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఈ నియోజకవర్గం నుంచి ఘన విజయం సాధించారాయన. ప్రస్తుతం భూపేష్ బఘేల్ మంత్రివర్గంలో కీలకమైన వైద్యారోగ్య శాఖను పర్యవేక్షిస్తోన్నారు. ఆయన స్థానాన్ని ఉప ముఖ్యమంత్రి హోదాగా మార్చడానికి కాంగ్రెస్ అధిష్ఠానం అంగీకరించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+