AP-TS Weather update: ఏపీలో మరో మూడు రోజులు వర్షాలు, తెలంగాణలోని పలు జిల్లాల్లోనూ
హైదరాబాద్/అమరావతి: తెలుగు రాష్ట్రాల్లో మరికొద్ది రోజులపాటు వర్షాలు కొనసాగనున్నాయి. వాయవ్య, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో మంగళవారం వాయుగుండం బలహీనపడి తీవ్ర అల్పపీడనంగా మారి ఆంధ్రప్రదేశ్ నుండి దూరంగా వెళ్లిపోయిందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రధానంగా తక్కువ ఎత్తులో పశ్చిమ/ నైరుతి గాలులు వీస్తున్నాయని వెల్లడించింది. వీటి ప్రభావం వలన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు వర్షాలు కురుస్తాయని తెలిపింది.

బుధ, గురు, శుక్రవారాల్లో ఉత్తర కోస్తా ఆంధ్రాలో ఉరుములు, మెరుపులుతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కొన్ని ప్రదేశములలో కురిసే అవకాశం ఉంది. శుక్రవారం ఉత్తర కోస్తా ఆంధ్రాలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేక రెండు ప్రదేశములలో కురిసే అవకాశం ఉంది.
దక్షిణ కోస్తా ఆంధ్రాలో రాగల మూడు రోజుల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేక రెండు ప్రదేశములలో కురిసే అవకాశం ఉంది.రాయలసీమలో బుధ, గురు, శుక్రవారాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేక రెండు ప్రదేశములలో కురిసే అవకాశం ఉంది.
తెలంగాణలో రాష్ట్రంలోనూ జోరు వానలు
తెలంగాణలో బుధవారం వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావారణ శాఖ హెచ్చరించింది. కొన్ని ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణశాఖ తెలిపింది. ముఖ్యంగా ములుగు, పెద్దపల్లి మంచిర్యాల, కొమురంభీమ్, భూపాల్ పల్లి, జగిత్యాల, ఆదిలాబాద్ జిల్లాల్లో రానున్న రెండుమూడు రోజులపాటు భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాక వెల్లడించింది.
తెలుగు రాష్ట్రాల్లో గత వారం పది రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్ని విషయం తెలిసిందే. రెండు మూడు రోజుల నుంచి కొంత ఎడతెరిపిచ్చినట్లు కనిపించినా రోజులో ఏదో ఒక సమయంలో వర్షం పడుతోంది. పలు ప్రాంతాల్లో మధ్యాహ్నం వరకు వేడిగా ఉండి.. ఆ తర్వాత సాయంత్రం వరకు వాతావరణం మారిపోతోంది. పలు చోట్ల సాయంత్రం లేదా రాత్రి సమయంలో వర్షాలు కురుస్తున్నాయి.












Click it and Unblock the Notifications