సీఎం పళనిసామిపై తిరుగుబాటు: నోటీసులకు సమాధానం ఇస్తాం: టీటీవీ గ్రూప్ ఎమ్మెల్యేలు !
అన్నాడీఎంకే ప్రభుత్వం మీద తిరుగుబాటు చేసి తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిసామి, ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వంను పదవుల నుంచి తప్పిస్తామని ఛాలెంజ్ చేసిన టీటీవీ దినకరన్ వర్గం ఎమ్మెల్యేలకు
చెన్నై: అన్నాడీఎంకే ప్రభుత్వం మీద తిరుగుబాటు చేసి తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిసామి, ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వంను పదవుల నుంచి తప్పిస్తామని ఛాలెంజ్ చేసిన టీటీవీ దినకరన్ వర్గం ఎమ్మెల్యేలకు ఆ రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ ధనపాల్ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే.
తమిళనాడు అసెంబ్లీ స్పీకర్ ధనపాల్ జారీ చేసిన నోటీసులకు మంగళవారంతో గడుపు వూర్తి అవుతుంది. ఈ సందర్బంలో దినకరన్ గ్రూప్ లోని ఎమ్మెల్యేలు స్పీకర్ ధనపాల్ ఇచ్చిన నోటీసులకు వివరణ ఇవ్వడానికి సిద్దం అయ్యారు.

స్పీకర్ ధనపాల్ కు కాకుండా తమిళనాడు అసెంబ్లీ కార్యదర్శి భూపతికి తాము వివరణ ఇస్తామని అన్నాడీఎంకే పార్టీ రెబల్ ఎమ్మెల్యేల నాయకుడు తంగ తమిళ సెల్వన్ చెప్పారు. ఎడప్పాడి పళనిసామి నాయకత్వాన్ని తాము ఎందుకు వ్యతిరేకిస్తున్నాము ? ప్రభుత్వానికి ఎందుకు మద్దతు ఉపసంహరించుకున్నాము ? అనే విషయంపై అసెంబ్లీ కార్యాదర్శి భూపతికి పూర్తి సమాచారంతో వివరణ ఇస్తామని, ఆ వివరాలు మీడియాకు చెప్పమని తంగ తమిళ సెల్వన్ చెప్పారు.












Click it and Unblock the Notifications