ప్రధాని మోడీ దెబ్బ: బెంగళూరు సెంట్రల్ జైల్లో శశికళతో టీటీవీ దినకరన్ భేటీ, ఏం చెయ్యాలి !
అన్నాడీఎంకే పార్టీ ప్రధాన కార్యదర్శి పదవి నుంచి బహిష్కరణకు గురైన శశికళతో ఆమె సోదరి కుమారుడు టీటీవీ దినకరన్ భేటీ అయ్యారు.
బెంగళూరు: అన్నాడీఎంకే పార్టీ ప్రధాన కార్యదర్శి పదవి నుంచి బహిష్కరణకు గురైన శశికళతో ఆమె సోదరి కుమారుడు టీటీవీ దినకరన్ భేటీ అయ్యారు. బుధవారం బెంగళూరు చేరుకున్న టీటీవీ దినకరన్ పరప్పన అగ్రహార సెంట్రల్ జైలు చేరుకుని ములాఖత్ లో చిన్నమ్మ శశికళతో భేటీ అయ్యారు.
ప్రస్తుతం తమిళనాడులో జరుగుతున్న రాజకీయాల గురించి, రెండాకుల చిహ్నం ఎలా సొంతం చేసుకోవాలి, ఎడప్పాడి పళనిసామి ప్రభుత్వాన్ని ఎలా కుప్పకూల్చాలి తదితర అంశాలపై శశికళ, టీటీవీ దినకరన్ చర్చించారని తెలిసింది. అనంతరం బయటకు వచ్చిన టీటీవీ దినకరన్ ను మీడియా పలకరించింది.

సెంట్రల్ జైల్లో శశికళతో ఏం మాట్లాడారూ అంటూ మీడియా ప్రశ్నించగా అదంతా రహస్యం అంటూ అక్కడి నుంచి వెళ్లిపోయారు. సోమవారం ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎం. కరుణానిధి ఇంటికి వెళ్లిన విషయం తెలిసిందే.
డీఎంకే పార్టీతో కలిసి ఎడప్పాడి పళనిసామి ప్రభుత్వాన్ని కుప్పకూల్చాలని మన్నార్ గుడి మాఫియా ప్రయత్నాలు చేస్తున్నది. కరుణానిధి ఇంటికి ప్రధాని మోడీ వెళ్లడంతో శశికళ వర్గం అయోమయంలో పడిపోయింది. ఈ సందర్బంలో ఏం చెయ్యాలి అంటూ సలహాలు, సూచనలు తీసుకోవడానికి టీటీవీ దినకరన్ జైల్లో శశికళతో భేటీ అయ్యారని తెలిసింది.












Click it and Unblock the Notifications