శాసన సభ సమావేశాలు, ప్రభుత్వ తీరుతో డీఎంకే వాకౌట్, దినకరన్ సీట్ నెంబర్!

Posted By:
Subscribe to Oneindia Telugu

చెన్నై: తమిళనాడు శాసన సభ సమావేశాలు సోమవారం ప్రారంభం కావడంతో ఆ రాష్ట్ర రాజకీయాలు రసవత్తరంగా మారాయి. తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామితో విలీనం అయిన తరువాత ఉప ముఖ్యమంత్రి పదవి చేపట్టిన పన్నీర్ సెల్వం మొదటిసారి అసెంబ్లీలో అడుగుపెట్టారు. ఆర్ కే నగర్ ఉప ఎన్నికల్లో స్వతంత్ర పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఎమ్మెల్యే అయిన అన్నాడీఎంకే పార్టీ రెబల్ నాయకుడు టీటీవీ దినకరన్ అసెంబ్లీలో అడుగుపెట్టాడు.

 గవర్నర్ హాజరు

గవర్నర్ హాజరు

సోమవారం చెన్నైలోని సచివాలయంలో శాసన సభ సమావేశాలను తమిళనాడు గవర్నర్ భన్వరీలాల్ పురోహిత్ ప్రారంభించారు. అనంతరం తమిళనాడు ప్రభుత్వం పనీ తీరు గురించి గవర్నర్ భన్వరీలాల్ పురోహిత్ ప్రసంగించారు.

ఓఖీ తుపాను

ఓఖీ తుపాను

గత డిసెంబర్ నెలలో కన్యాకుమారి జిల్లాతో పాటు తమిళనాడును ఓఖీ తుపాను అతలాకుతలం చేసిన విషయం తెలిసిందే. ఆ సందర్బంలో సముద్రంలో చిక్కుకుపోయిన మత్స్యకారులను కేంద్ర, తమిళనాడు ప్రభుత్వాలు వారి కోసం గాలించి సురక్షితంగా రక్షించారని గవర్నర్ భన్వరీలాల్ పురోహిత్ శాసన సభ సమావేశంలో చెప్పారు.

Big News Big Bite : Today Trending News
సహాయం చేశారు

సహాయం చేశారు

ఓఖీ తుపాను కారణంగా నష్టపోయిన వారిని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకుంటున్నాయని గవర్నర్ భన్వరీలాల్ పురోహిత్ చెప్పారు. బాధితులకు అన్ని విధాలుగా సహాయం చెయ్యడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సిద్దంగా ఉన్నాయని గవర్నర్ భన్వరీలాల్ పురోహిత్ అన్నారు.

 ప్రతిపక్షాలు వాకౌట్

ప్రతిపక్షాలు వాకౌట్

ఓఖీ తుపాను భాధితులను ఆదుకోవడంలో కేంద్ర, తమిళనాడు ప్రభుత్వాలు విఫలం అయినా గవర్నర్ వారికి అనుకూలంగా ప్రసంగిస్తున్నారని ఆరోపిస్తూ ఆ రాష్ట్ర ప్రధాన ప్రతిపక్ష పార్టీ డీఎంకే ఎమ్మెల్యేలు, ప్రతిపక్షాల ఎమ్మెల్యేలు శాసన సభ సమావేశం బహిష్కరించి నిరసన వ్యక్తం చేశారు.

టీటీవీ సీట్ నెంబర్ !

టీటీవీ సీట్ నెంబర్ !

ఆర్ కే నగర్ ఉప ఎన్నికల్లో ఎమ్మెల్యేగా విజయం సాధించిన అన్నాడీఎంకే పార్టీ రెబల్ నాయకుడు టీటీవీ దినకరన్ మొదటి సారి తమిళనాడు అసెంబ్లీలో అడుగుపెట్టారు. స్వతంత్ర పార్టీ అభ్యర్థిగా విజయం సాధించిన టీటీవీ దినకరన్ కు స్పీకర్ ధనపాల్ సీట్ నెంబర్ 148 కేటాయించారు.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకలల జీవిత భాగస్వామిని కనుగొనండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
First Session of the Tamil Nadu Legislative Assembly starts today. Governor Panwari Lal Purohit inaugurates the assembly. Governor speaks about Ockhi in TN assembly. He says TN and Central goverment are working together to find the missing fishermen.Dinakaran participated in First Session of the TN Legislative Assembly. He got the seat number 148.
Please Wait while comments are loading...

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి