Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఢిల్లీ కేసులో టీటీవీ దినకరన్ పేరు మాయం, ఏం మాయ చేశారు, ఢిల్లీ దెబ్బతో, ఏంటి కథ ?

అన్నాడీఎంకే పార్టీ రెండాకుల చిహ్నం కోసం ఎన్నికల కమిషన్ కు రూ. 50 కోట్లు ఎరవేశారని ఢిల్లీ క్రైం బ్రాంచ్ పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఎన్నికల కమిషన్ కు లంచం ఎర వేశారని నమోదు అయిన కేసులో ఢి

న్యూఢిల్లీ/చెన్నై: అన్నాడీఎంకే పార్టీ రెండాకుల చిహ్నం కోసం ఎన్నికల కమిషన్ కు రూ. 50 కోట్లు ఎరవేశారని ఢిల్లీ క్రైం బ్రాంచ్ పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఎన్నికల కమిషన్ కు లంచం ఎర వేశారని నమోదు అయిన కేసులో ఢిల్లీ క్రైం బ్రాంచ్ పోలీసులు చార్జీషీట్ నమోదు చేసి కోర్టులో సమర్పించారు.

ఎన్నికల కమిషన్ కు లంచం ఎరవేశారని నమోదు అయిన కేసులో వీకే. శశికళ మేనల్లుడు టీటీవీ దినకరన్ తో సహ ఆయన సన్నిహితుడు మల్లికార్జున, మీడియేటర్ సుఖేష్ చంద్రశేఖర్ తదితరులను ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. నెల రోజులకు పైగా తీహార్ జైల్లో ఉన్న టీటీవీ దినకరన్ తరువాత బెయిల్ మీద బయటకు వచ్చాడు.

TTV Dinakaran’s name was not included the charge sheet the EC bribery case

టీటీవీ దినకరన్ దెబ్బకు చెన్నై నగరంలోని ఆర్ కే నగర ఉప ఎన్నికలు సైతం రద్దు అయిన విషయం తెలిసిందే. అయితే ఎవ్వరూ ఊహించిన విధంగా ఎన్నికల కమిషన్ కు లంచం ఎరవేశారని నమోదు అయిన కేసులో టీటీవీ దినకరన్ పేరు తొలగించారు.

ఢిల్లీ పోలీసులు నమోదు చేసిన చార్జ్ షీట్ లో టీటీవీ దినకరన్ పేరు లేదని శుక్రవారం వెలుగు చూసింది. టీటీవీ దినకరన్ కు వ్యతిరేకంగా ఎలాంటి ఆధారాలు లేవని ఢిల్లీ క్రైం బ్రాంచ్ పోలీసులు కోర్టులో నివేదిక సమర్పించారు. ఎన్నికల కమిషన్ కు లంచం ఎర వేశారని నమోదు అయిన కేసు నుంచి టీటీవీ దినకరన్ కు విముక్తి కలగడంతో ఆయన అనుచరులు పండగ చేసుకుంటున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+