తమిళనాడు మొత్తం పోటీ, దినకరన్, కొత్త పార్టీ, మన్నార్ గుడి స్కెచ్, పళని, పన్నీర్!

Posted By:
Subscribe to Oneindia Telugu

చెన్నై: అన్నాడీఎంకే పార్టీ మీద తిరుగుబాటు చేసి ఆర్ కే నగర్ ఉప ఎన్నికల్లో తమిళనాడు ప్రభుత్వానికి, ప్రతిపక్షాలకు చుక్కలు చేపించి ఎమ్మెల్యే అయిన టీటీవీ దినకరన్ తమిళనాడులో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో మొత్తం పోటీ చేస్తానని చెప్పారు. అయితే సొంత పార్టీ లేకుండా మీరు ఎలా పోటీ చేస్తారు అని మీడియా ప్రశ్నిస్తే టీటీవీ దినకరన్ నీళ్లు నమిలారు.

అభ్యర్థులు రెడీ !

అభ్యర్థులు రెడీ !

చెన్నైలో గురువారం మీడియాతో మాట్లాడిన టీటీవీ దినకరన్ త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో తమ వర్గీయులు అన్ని చోట్ల పోటీ చేస్తారని, అందులో ఎలాంటి సందేహం లేదని, అభ్యర్థులను సిద్దం చేస్తున్నామని టీటీవీ దినకరన్ చెప్పారు.

సింబల్ లేదు కదా ?

సింబల్ లేదు కదా ?

ఆర్ కే నగర్ ఉప ఎన్నికల్లో స్వతంత్ర పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన టీటీవీ దినకరన్ కు ఎన్నికల కమిషన్ అధికారులు ప్రెషర్ కుక్కర్ గుర్తు కేటాయించిన విషయం తెలిసిందే. ఇప్పుడు టీటీవీ దినకరన్ వర్గం దగ్గర ఎలాంటి గుర్తు లేదు.

Tamil Nadu Politics : పళని, పన్నీర్ వర్గంలోకి రెబల్ ఎమ్మెల్యేలు
 ఆ గుర్తు చాల కష్టం !

ఆ గుర్తు చాల కష్టం !

టీటీవీ దినకరన్ కొత్త పార్టీ పెట్టిన తరువాత ఆయన తమకంటూ ఓ చిహ్నం కేటాయించాలని ఎన్నికల కమిషన్ అధికారులను సంప్రధిచాల్సి ఉంటుంది. అయితే ఎలాంటి పార్టీ లేకుండా తమ వర్గీయులు అందరికీ ప్రెషర్ కుక్కర్ గుర్తు కేటాయించాలని టీటీవీ దినకరన్ ఎన్నికల కమిషన్ కు మనవి చేసినా అలా కేటాయించడానికి సాధ్యం కాదు.

పళని, పన్నీర్ స్కెచ్

పళని, పన్నీర్ స్కెచ్

ఆర్ కే నగర్ ఉప ఎన్నికల్లో ఎమ్మెల్యే అయిన టీటీవీ దినకరన్ మంచి జోరు మీద ఉన్నాడు. టీటీవీ దినకరన్ ఆవేశంలో కొత్త పార్టీ పెడితే అన్నాడీఎంకే, రెండాకుల చిహ్నంకు ఎలాంటి అడ్డంకులు ఉండవని, శాస్వతంగా తమ వద్ద ఉంటాయని పళనిస్వామి, పన్నీర్ సెల్వం వర్గాలు భావిస్తున్నాయి.

ఆలోచిస్తున్న టీటీవీ ?

ఆలోచిస్తున్న టీటీవీ ?

కొత్త పార్టీ పెడితే అన్నాడీఎంకే పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, నాయకులు తనకు శాస్వతంగా దూరం అయ్యే అవకాశం ఉందని టీటీవీ దినకరన్ ఆలోచిస్తున్నాడు. ఆర్థికంగా ఎంతో బలంగా ఉన్న మన్నార్ గుడి మాఫియా సైతం కొత్త పార్టీ విషయంలో ఆచితూచి అడుగులు వెయ్యాలని భావిస్తున్నదని సమాచారం.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకలల జీవిత భాగస్వామిని కనుగొనండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
TTV Dinakaran says He is ready to contest in the local body election. But he is refused to answer about to start individual party.
Please Wait while comments are loading...

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి