తమిళనాడు రెబల్ ఎమ్మెల్యేలకు కాస్త ఊరట: మద్రాస్ హైకోర్టు ఓకే, రేపు 18 మంది భవిష్యత్తు ?

Posted By:
Subscribe to Oneindia Telugu

చెన్నై: తమిళనాడు ప్రభుత్వం మీద తిరుగుబాటు చేసి అన్నాడీఎంకే పార్టీ ఫిరాయింపు నిరోధక చట్టం కింద అనర్హతకు గురైన 18 మంది దినకరన్ గ్రూప్ ఎమ్మెల్యేలు కాస్త ఊపిరిపీల్చుకున్నారు. అన్నాడీఎంకే రెబల్ ఎమ్మెల్యేల దాఖలు చేసిన పిటిషన్ ను సత్వర విచారణకు మద్రాసు హైకోర్టు స్వీకరించింది.

షాక్: రెబల్ ఎమ్మెల్యేల మీద అనర్హత వేటు: గవర్నర్ రాక ముందే దినకరన్ దిమ్మ తిరిగింది!

తమిళనాడు అసెంబ్లీ స్పీకర్ ధనపాల్ 18 మంది రెబల్ ఎమ్మెల్యేల మీద అనర్హత వేటు వెయ్యడాన్ని సవాలు చేస్తూ దినకరన్ గ్రూప్ మద్రాసు హైకోర్టును ఆశ్రయించింది. రెబల్ ఎమ్మెల్యేల తరపున సీనియర్ న్యాయవాది పీఆర్. రామన్ కోర్టులో వాదించారు..

TTV Dinakaran supporters file petion against Speaker order

తమిళనాడు అసెంబ్లీలో ఎడప్పాడి పళనిసామి ప్రభుత్వం విశ్వాస పరీక్ష నిర్వహించడానికి సిద్దం అవుతున్న సమయంలో పిటిషన్ సత్వర విచారణ చెయ్యకుంటే 18 మంది ఎమ్మెల్యేలు ఓటు వెయ్యడానికి అనర్హులు అవుతారని, ఇది వారి రాజ్యంగ హక్కులపై ప్రభావం చూపిస్తుందని న్యాయవాది రామన్ కోర్టులో మనవి చేశారు.

తమిళనాడు ఎఫెక్ట్: కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్, గవర్నర్ విద్యాసాగర్ రావ్ భేటీ !

రెబల్ ఎమ్మెల్యేల పిటిషన్ పరిశీలించిన న్యాయమూర్తి ఎం. దొరైసామి బుధవారం పిటిషన్ విచారణ చేస్తామని చెప్పారు. సరైన పిటిషన్ తో కోర్టు ముందుకు రావాలని ఇదే సమయంలో రెబల్ ఎమ్మెల్యేలకు జస్టిస్ ఎం. దొరైసామి సూచించారు. బుధవారం దినకరన్ గ్రూప్ ఎమ్మెల్యేల రాజకీయ భవిష్యత్తు తేలిపోనుంది.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
TTV Dinakaran supporters high court against speaker disqualified 18 mlas in Assembly speaker ordes

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి