వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

శశికళకు షాక్, పళని, పన్నీర్ వర్గంలోకి రెబల్ ఎమ్మెల్యేలు జంప్, మొదటికే మోసం, ఎలా!

|
Google Oneindia TeluguNews

Recommended Video

Tamil Nadu Politics : పళని, పన్నీర్ వర్గంలోకి రెబల్ ఎమ్మెల్యేలు

చెన్నై: తమిళనాడు రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. ఇంతకాలం చిన్నమ్మ శశికళ, టీటీవీ దినకరన్ భజన చేసిన అన్నాడీఎంకే పార్టీ రెబల్ ఎమ్మెలు, ఎంపీలు ఇప్పుడు ఎడప్పాడి పళనిసామి, పన్నీర్ సెల్వం వర్గంలోకి జంప్ కావడానికి రాయభారం నడుపుతున్నారు. ఇలాగే ఉంటే మొదటికే మోసం వస్తోందని ఆందోళన చెందుతున్నారు.

ఎలాగైనా తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిసామి, ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం వర్గంలోని నాయకులతో చర్చలు జరిపి వెంటనే ఆ వర్గంలోకి జంప్ అయ్యి తమ పదవులు కాపాడుకోవాలని రెబల్ ఎమ్మెల్యేలు, ఎంపీలు ప్రయత్నాలు చేస్తున్నారని వెలుగు చూసింది.

 పార్టీ సర్వాధికారాలు వారి చేతిలో!

పార్టీ సర్వాధికారాలు వారి చేతిలో!

అన్నాడీఎంకే పార్టీ, రెండాకుల చిహ్నం ఎడప్పాడి పళనిసామి, పన్నీర్ సెల్వం వర్గం చేతికి వెళ్లిన విషయం తెలిసిందే. అన్నాడీఎంకే పార్టీ సర్వాధికారాలు ఇప్పుడు పళనిసామి, పన్నీర్ సెల్వం చేతిలో ఉన్నాయి. ఇప్పటికే దినకరన్ గ్రూప్ లోని 18 మంది రెబల్ ఎమ్మెల్యేల మీద తమిళనాడు స్పీకర్ ధనపాల్ అనర్హత వేటు వేశారు.

ఇప్పటికే వేటు, కోర్టులో!

ఇప్పటికే వేటు, కోర్టులో!

అన్నాడీఎంకే పార్టీ రెండాకుల చిహ్నం వ్యవహారం ఎన్నికల కమిషన్ దగ్గర ఉందని, మేము పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడలేదని రెబల్ ఎమ్మెల్యేలు కోర్టును ఆశ్రయించారు. రెబల్ ఎమ్మెల్యేల వ్యవహారం కోర్టులో ఉంది. అయితే అన్నాడీఎంకే పార్టీ తమిళనాడు ప్రభుత్వం చేతికి వెళ్లడంతో ఇప్పుడు రెబల్ ఎమ్మెల్యేలు హడలిపోతున్నారు.

ఎప్పుడు ఏం జరుగుతుందో?

ఎప్పుడు ఏం జరుగుతుందో?

శశికళ ఇప్పటికే జైలుకు వెళ్లడం, ఆమె కుటుంబ సభ్యుల మీద వరుసగా ఆదాయపన్ను శాఖ దాడులు జరగడం, అన్నాడీఎంకే పార్టీ పళనిసామి, పన్నీర్ సెల్వం వర్గానికి వెళ్లడంతో రెబల్ ఎమ్మెల్యేలు దిక్కుతోచని పరిస్థితిలో ఆందోళన చెందుతున్నారు.

మొదటికే మోసం వస్తోంది!

మొదటికే మోసం వస్తోంది!

టీటీవీ దినకరన్ మీద అనేక కేసులు ఉన్నాయని, ఆ కేసుల్లో ఆయన ఎప్పుడు జైలుకు వెలుతారో ఎవరికీ తెలుసని, ఇలాంటి సమయంలో శశికళ కుటుంబ సభ్యులను నమ్ముకుని ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎదురు తిరిగితే మొదటికే మోసం వస్తోందని రెబల్ ఎమ్మెల్యేలు, ఎంపీలు భావిస్తున్నారని సమాచారం.

 మాజీ మంత్రి రాయభారం!

మాజీ మంత్రి రాయభారం!

తమిళనాడు ప్రభుత్వం మీద తిరుగుబాటు చేసిన రెబల్ ఎమ్మెల్యేలు ఆ రాష్ట మాజీ మంత్రి, పన్నీర్ సెల్వంకు అత్యంత సన్నిహితుడు కేపీ. మునిసామితో ఇప్పటికే కొందరు ఎమ్మెల్యేలు, నలుగురు ఎంపీలు రాజీ ప్రయత్నాలు మొదలు పెట్టారని తెలిసింది. మొత్తం మీద శశికళ, టీటీవీ దినకరన్ కు త్వరలోనే మరో ఎదురుదెబ్బ తగిలే అవకాశం ఉంది.

English summary
TTV faction ex MLAs and MPs try to jump to Edappadi faction as he has the governent and AIADMK party.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X