ఆపదలో ఆదుకుంటే భారత్‌కే వెన్ను పోటు పోడుస్తారా..? పాకిస్థాన్ కంటే చాలా డేంజర్
భారత్ సాధారణంగా ఏ దేశంతోనూ విభేదాలు పెట్టుకోదు. అలా అని మన దేశంపై దాడి చేస్తే చేతులు కట్టుకుని కూర్చోదు. దాడి చేసిన వారికి తగిన గుణపాఠం చెబుతోంది. పహల్గామ్‌లో ఉగ్రవాదుల దాడి తర్వాత ఇండియా , పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడ్డాయి. టూరిస్టులపై దాడికి ప్రతీకారంగా పాక్‌లోని ఉగ్రవాదులపై దాడులు చేసింది ఇండియాన్ ఆర్మీ. ఆపరేషన్ సింధూర్ పేరిట పాకిస్థాన్‌లో ఉన్న ఉగ్రవాదుల స్థావరాలపై దాడి చేసింది భారత్ ఆర్మీ. ఈ దాడిలో పలువురు ఉగ్రవాదులు మరణించారు.
పాకిస్థాన్ సైతం ఇండియాపై దాడికి దిగింది. ఈ సమయంలో ప్రపంచ దేశాలు మొత్తం కూడా ఇండియాకు మద్దతుగా నిలవగా, ఒక్క దేశం మాత్రం పాకిస్థాన్‌కు అండగా నిలిచింది. ఆ దేశం మరేదో కాదు టర్కీ. ఆ దేశం మొదటి నుంచి కూడా ఇండియాపై తన అక్కస్సును వెళ్లగక్కుతూ వస్తోంది. టర్కీ ఎల్లప్పుడూ కాశ్మీర్ విషయంలో పాకిస్తాన్‌కు మద్దతు తెలుపుతూ వస్తోంది. టర్కీ అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగాన్ అనేక అంతర్జాతీయ వేదికలపై కాశ్మీర్‌ను వివాదాస్పద ప్రాంతంగా పేర్కొంటూ భారత్‌ను విమర్శించారు.

ఇది భారత్‌కు ఆగ్రహం తెప్పించింది, ఎందుకంటే కాశ్మీర్ భారతదేశ అంతర్గత వ్యవహారమని భారత్ స్పష్టం చేస్తూ వస్తోంది.2023లో టర్కీ భారీ భూకంపానికి గురైంది. ఈ సమయంలో ఇవేమి పట్టించుకుని భారత్, టర్కీకి ఆపన్న హస్తం అందించింది.టర్కీలో సంభవించిన భూకంపం సమయంలో భారత్ మానవతా సహాయం అందించింది. ఆపరేషన్ దోస్త్ పేరిట టర్కీకి భారీ సాయం చేసింది భారత్. కానీ టర్కీ మాత్రం తన వక్ర బుద్ధిని బయటపెట్టింది. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత టర్కీ పాకిస్తాన్‌కు సంపూర్ణ మద్దతు ప్రకటించడమే కాకుండా ఆయుధాలు పంపించి ఆ దేశానికి అండగా నిలిచింది.
టర్కీ ఇచ్చిన డ్రోన్లతోనే పాకిస్థాన్ ఇండియాపై దాడికి దిగింది. అయితే ఆ డ్రోన్లను భారత్ ఆర్మీ కూల్చి వేయడంతో ఎలాంటి ప్రాణ నష్టం వాటిల్లలేదు. ఎలాగూ ఇండియాపై యుద్ధం గెలవలేమని భావిచించిన పాకిస్థాన్, అమెరికా కాళ్లు పట్టుకుని యుద్ధాన్ని ఆపించింది. అయితే పాకిస్థాన్‌కు అండగా నిలిచిన టర్కీ దేశంతో భావిష్యత్తులో ఎలాంటి సాయం చేకూడదని నిపుణులు చెబుతున్నారు. వారితో ఉన్న వాణిజ్య వ్యాపారాలను కూడా రద్దు చేసుకోవాలని సూచిస్తున్నారు. ఇంకా చెప్పాలంటే పాకిస్థాన్ కంటే ఇలా వెన్నుపోటు పోడిచే దేశాలతోనే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని వారు హెచ్చరిస్తున్నారు.












Click it and Unblock the Notifications