Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

టర్కీ-సిరియా భూకంపం: శిథిలాల కింద ఆచూకీ లేని భారతీయ వ్యాపారవేత్త మృతదేహం లభ్యం

టర్కీ-సిరియా భూకంపంలో ఓ భారతీయుడు కూడా ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషయాన్ని భారత రాయబార కార్యాలయం ఈ విషయాన్ని ధృవీకరించింది.

న్యూఢిల్లీ: టర్కీ-సిరియాలో ఇటీవల సంభవించిన భారీ భూకంపం పెను విషాదాన్ని నింపింది. ఈ రెండు దేశాల్లో భూకంపం కారణంగా ఇప్పటి వరకు 25వేల మందికిపైగా మరణించారు. లక్ష మంది వరకు గాయాలపాలయ్యారు. ఇప్పటికీ భవన శిథిలాల నుంచి క్షతగాత్రులను, మృతులను బయటికి తీస్తున్నారు. కాగా, ఈ భూకంపంలో ఓ భారతీయుడు కూడా ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషయాన్ని భారత రాయబార కార్యాలయం ఈ విషయాన్ని ధృవీకరించింది.

టర్కీలోని మాలత్య నగరంలో భూకంప ప్రభావిత ప్రాంతం నుంచి బయటికి తీసిన మృతుడిని ఉత్తరాఖండ్‌కు చెందిన విజయ్ కుమార్‌గా గుర్తించారు. ఆయనో వ్యాపారవేత్త అని, బిజినెస్ ట్రిప్ మీద మాలత్యకు వచ్చినట్లు అక్కడి భారతీయ రాయబార కార్యాలయం తెలిపింది. భూకంప ఘటన జరిగిన నాటి నుచి ఆచూకీ లేకుండా పోయారని, తాజాగా, ఇక్కడి ఓ హోటల్ శిథిలాల్లో ఆయన మృతదేహం లభించినట్లు వెల్లడించింది.

Turkiye-Syria earth quake: Uttarakhand Man Missing Since Earthquake Confirmed Dead.

మృతుడి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి ప్రకటిస్తూ.. భౌతిక కాయాన్ని వీలైనంత త్వరగా భారత్‌కు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని ట్విట్టర్ వేదికగా వెల్లడించింది. కాగా, విజయ్ కుమార్ మృతి చెందాడని తెలిసి ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని ఆయన కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

ఇది ఇలావుండగా, ఫిబ్రవరి 6న సంభవించిన భారీ భూకంపం టర్కీ, సిరియాలోని వేలాది కుటుంబాల్లో పెను విషాదాన్ని నింపింది. ఇప్పటికే 25వేల మందికిపైగా మరణించారు. లక్ష మంది వరకు క్షతగాత్రులు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. అయితే, ప్రస్తుతం భూకంప ప్రభావిత ప్రాంతాల్లో అతి శీతల పరిస్థితులు నెలకొన్నాయి. గడ్డకట్టే చలిలో సహాయక చర్యలకు తీవ్ర ఆటంకం కలుగుతోంది. దీంతో శిథిలాల కింద మరికొంతమంది చనిపోయే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+