వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
భారత కొత్త సొలిసిటర్ జనరల్‌గా తుషార్ మెహతా నియామకం
న్యూఢిల్లీ: భారత సొలిసిటర్ జనరల్‌గా సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది తుషార్ మెహతా నియమితులయ్యారు. గత అక్టోబర్ 20న సీనియర్ న్యాయవాది రంజిత్ కుమార్ రాజీనామా చేసినప్పటి నుంచీ సొలిసిటర్ జనరల్ స్థానం ఖాళీగా ఉంది.
దాదాపు ఏడాది తర్వాత ఆయన స్థానంలో తుషార్ మెహతాను కేంద్రం నియమించింది. 2014 నుంచి అదనపు సొలిసిటర్ జనరల్‌గా పలు కీలక కేసుల్లో మెహతా వాదనలు వినిపించారు.

2020 జూన్ 30 వరకు లేదా తదుపరి ఆదేశాలు వెలువడే వరకు తుషార్ మెహతా సొలిసిటర్ జనరల్‌గా కొనసాగనున్నారు. భారత ప్రభుత్వ న్యాయ అధికారుల్లో సొలిసిటర్ జనరల్ అనేది రెండో ర్యాంక్ పదవి.
తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!