ప్రాణం తీసిన జిమ్ - మరో స్టార్ బలి..!!
ముంబై: జిమ్.. మరో నటుడి ప్రాణం తీసింది. శాండల్‌వుడ్ సూపర్‌స్టార్ పునీత్ రాజ్‌కుమార్ కన్నుమూసిన ఉదంతాన్ని గుర్తుకు తెచ్చింది. గత ఏడాది అక్టోబర్ 29వ తేదీన జిమ్ చేస్తూ గుండెపోటుకు గురై- పునీత్ రాజ్‌కుమార్ తుదిశ్వాస విడిచిన విధంగా తాజాగా మరో నటుడు కన్నుమూశారు. బుల్లితెర సూపర్ స్టార్ సిద్ధాంత్ వీర్ సూర్యవంశీ మరణించారు. ఆయన వయస్సు 46 సంవత్సరాలు. ఆయనకు భార్య అలీసా రౌత్, ఇద్దరు పిల్లలు ఉన్నారు.
జిమ్ చేస్తూ గుండెపోటుకు గురయ్యారు సిద్ధాంత్ వీర్ సూర్యవంశీ. అక్కడికక్కడే కుప్పకూలిపోయారు. వెంటనే ఆయనను ఆసుపత్రికి తరలించగా.. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందారు. టీవీ నటుడు దీపేష్ భాన్, స్టాండప్ కమేడియన్, బాలీవుడ్ నటుడు రాజు శ్రీవాస్తవ్ ఈ మధ్యకాలంలోనే మరణించారు. ఇప్పుడు తాజాగా సిద్ధాంత వీర్ కూడా కన్నుమూయడంతో బాలీవుడ్ ఫిల్మ్ అండ్ టీవీ ఇండస్ట్రీ శోకసముద్రంలో మునిగింది.

సిద్ధాంత్ వీర్ మృతిపట్ల పలువురు బాలీవుడ్ ప్రముఖులు తమ సంతాపాన్ని వ్యక్తం చేస్తోన్నారు. కాశ్మీర్ ఫైల్స్ దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి, మాజీ క్రికెటర్ సలీల్ అంకోలా ఈ విషాదకర ఘటన పట్ల దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. వివేక్ అగ్నిహోత్రి ఈ తరం నటులకు హెచ్చరిక కూడా చేశారు. దేహ ధారుడ్యాన్ని పెంచుకోవాల్సిన అవసరం ఉన్నప్పటికీ.. జాగ్రత్తలను తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉంటుందని సూచించారు. హైపర్ జిమ్ వల్ల విలువైన ప్రాణాలను కోల్పోవద్దని పేర్కొన్నారు.
బాలాజీ టెలిఫిల్మ్స్ అధినేత్రి ఏక్తా కపూర్ నిర్మించిన కుసుమ్ సీరియల్‌తో బుల్లితెరకు పరిచయం అయ్యాడు సిద్ధాంత్ వీర్ సూర్యవంశీ. మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. పలు సూపర్ హిట్ సీరియళ్లల్లో నటించాడు. కృష్ణ అర్జున్, కసౌటీ జిందగీ కి, జమీన్ సే ఆస్మాన్ తక్, భాగ్య విధాత, మమత, ఖయామత్, క్యా దిల్ మే హై, గృహస్తి, విరుద్ధ్, సూర్యపుత్ర్ కర్ణ్, వారిస్, కంట్రోల్ రూమ్, జిద్దీ దిల్ మానే నా, క్యూ రిష్తోం మే కట్టీ బట్టీ.. వంటి మెగా సూపర్ హిట్ సీరియళ్లతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు.
-
26/11 దాడుల నుంచి తృటిలో తప్పించుకున్నా: ధురంధర్ విలన్ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
viral video: ధురంధర్-2 చూసిన పాకిస్థాన్ ఫ్యామిలీ.. భారత్ కు వార్నింగ్..?? -
"ధురంధర్" డైరెక్టర్ నెక్స్ట్ సినిమా ఆ స్టార్ హీరోతోనే ??? -
నటి డ్రెస్ జిప్ తీసేసిన హీరో: డైరెక్టర్ కట్ చెప్పినా ఆగని రొమాన్స్! -
హిందీ స్టార్ హీరోల వేధింపుల వల్లే డైరెక్టర్లకు కష్టాలు.. -
సొంత భర్త సినిమాకు దీపిక ఆబ్సెంట్.. ఏం జరుగుతోంది..? -
"ధురంధర్ 2 సినిమాను బ్యాన్ చేయాలి" -
'ధురంధర్ 2'పై టాలీవుడ్ హీరోల ప్రశంసలు.. ప్రకాష్ రాజ్ రియాక్షన్ ఇదే! -
ఐ లవ్డ్ ధురంధర్ 1.. బట్ - జక్కన్న సెన్సేషన్ రివ్యూ: అలాంటి హీరోలందరినీ చంపేసింది -
బన్నీ మూవీలో ఐదుగురు భామలా? అట్లీ స్కెచ్ మామూలుగా లేదుగా! -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్!












Click it and Unblock the Notifications