విజయ్ విజిల్ రీసౌండ్- పెరంబూరు, తిరుచ్చి ఈస్ట్ గ్రౌండ్ రిపోర్ట్
అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ గడువు సమీపిస్తోన్న కొద్దీ తమిళనాడులో ప్రచారం హోరెత్తుతోంది. డీఎంకే, అన్నా డీఎంకే, టీవీకే.. ఈ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. గెలిచి తీరాలనే పట్టుదలతో ఉన్నాయి. దీనికి అనుగుణంగా వ్యూహ ప్రతివ్యూహాలను రూపొందించుకుంటోన్నాయి. టీవీకే పూర్తిస్థాయిలో ఎన్నికల బరిలో నిల్చోవడం వల్ల త్రిముఖ పోరు ఏర్పడింది. దాదాపు అన్ని నియోజకవర్గాల్లోనూ హోరాహోరి పోరు తప్పకపోవచ్చు.
తమిళనాడు శాసనసభ ఎన్నికల పోలింగ్ ఈ నెల 23వ తేదీన జరగనుంది. మే 4న ఓట్లను లెక్కిస్తారు. ఈ పరిణామాల మధ్య టీవీకే అధినేత విజయ్ పోటీ చేస్తోన్న పెరంబూరు, తిరుచిరాపల్లి ఈస్ట్ నియోజకవర్గాలపై అందరి దృష్టీ నిలిచింది. ఆయా చోట్ల విజయ్ అరంగేట్రం చేయడం రసవత్తర పోరుకు తెరలేపింది. పెరంబూరులో సిట్టింగ్ డీఎంకే ఎమ్మెల్యే ఆర్‌డీ శేఖర్‌కు సవాలు విసురుతున్నారు విజయ్. డీఎంకేకు కంచుకోట ఇది. గత ఎన్నికల్లో ఏఐఏడీఎంకే అభ్యర్థి ఎన్ఆర్ ధనపాలన్‌పై 54,976 ఓట్ల భారీ మెజారిటీతో విజయం సాధించారు శేఖర్.

అన్ని పార్టీలనూ ఆదరించారు పెరంబూర్ ఓటర్లు. డీఎంకే, ఏఐఏడీఎంకే, సీపీఎం, సోషలిస్ట్, కాంగ్రెస్.. ఇలా అన్ని పార్టీల అభ్యర్థులూ ఇక్కడి నుంచి గెలుపొందారు. 1977 నుంచి 1991 వరకు డీఎంకే, 2001 నుంచి 2016 వరకు సీపీఎం ఇక్కడ పాగా వేసింది. 2016లో ఏఐఏడీఎంకేకు చెందిన పీ వెట్రివాల్ 519 ఓట్ల స్వల్ప తేడాతో గెలిచారు. 2021లో ఆర్‌డీ శేఖర్ భారీ విజయంతో డీఎంకే ఆధిపత్యం నెలకొంది.
అన్ని పార్టీలను ఆదరించినందు వల్లే విజయ్ ఈ సీటును ఎంచుకున్నారనే అభిప్రాయం ఉంది. హీరోగా తనపై ఉన్న అభిమానాన్ని ఓట్లుగా మలచుకోగలిగితే పెరంబూర్ లో విజయ్ గెలుపు నల్లేరు మీద నడకే. విజయ్‌కి భారీ ప్రజాదరణ ఉన్నా పెరంబూరును నిలుపుకోవడానికి డీఎంకే గట్టి ప్రయత్నాలు సాగిస్తోంది. 2021 ఎన్నికల్లో ఆర్‌డీ శేఖర్ భారీ విజయం, ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ కంచుకోట కొళత్తూరుకు పెరంబూరు భౌగోళికంగా దగ్గరగా ఉండటం డీఎంకేకు అనుకూలం.
విజయ్ పోటీలో ఉన్న మరో నియోజకవర్గం తిరుచిరాపల్లి ఈస్ట్. ఇక్కడ కూడా ఆయన సిట్టింగ్ డీఎంకే ఎమ్మెల్యే ఇనిగో ఎస్ ఇరుదయరాజ్ ను ఢీకొంటున్నారు. 2011లో ఏర్పడిన స్థానం ఇది. మొదటి రెండు ఎన్నికల్లో ఏఐఏడీఎంకే ఆధీనంలో ఉండగా, 2021లో డీఎంకే గెలుచుకుంది. గత ఎన్నికల్లో ఇనిగో ఇరుదయరాజ్ ఎస్, మాజీ ఎమ్మెల్యే వెల్లమండి నటరాజన్‌పై 53,797 ఓట్ల భారీ తేడాతో విజయం సాధించారు.
ఈ స్థానాన్ని తిరిగి దక్కించుకోవడానికి ఏఐఏడీఎంకే జీ రాజశేఖరన్‌ను రంగంలోకి దింపింది. వృత్తిరీత్యా ఇంటీరియర్ డిజైనర్ కన్సల్టెంట్‌గా ఉన్న రాజశేఖరన్.. తిరుచ్చిలో ఏఐఏడీఎంకే కోశాధికారి, ఐటీ విభాగ సభ్యుడు కూడా. గత ఎన్నికల్లో భారీ విజయం సాధించడంతో తిరుచ్చి తూర్పులో డీఎంకేకు స్పష్టమైన ఆధిక్యత ఉంది. దాని పొరుగునే ఉన్న తిరుచిరాపల్లి వెస్ట్ నియోజకవర్గానికి స్వయానా డీఎంకే మంత్రి కెఎన్ నెహ్రూ ప్రాతినిథ్యాన్ని వహిస్తోన్నారు. తిరుచ్చి ఈస్ట్ పై దీని ప్రభావం పడే అవకాశం ఉంది.
-
విజయ్ ప్రచారంలో దారుణం: అభిమానుల్ని బూట్లతో తన్నిన బౌన్సర్లు -
జయలలిత వారసురాలు! అమ్మ స్టైల్లో ఎన్నికల ప్రచారం -
కోలీవుడ్ పట్టించుకోకున్నా "దళపతి విజయ్"కి అండగా మెగాస్టార్..! -
దళపతి విజయ్‌కు బిగ్ షాక్: రిలీజ్‌కు ముందే ‘జన నాయగన్’ లీక్! -
ప్రతిసారి హిట్ ఎలా కొడతావ్ అన్న! -
కేసీఆర్ ఫోన్, పరుగులు పెట్టిన ఆఫీసర్లు. -
మరో 100 కోట్ల బొమ్మ.. హిట్ మీద హిట్ కొట్టడం నీకే సాధ్యం అన్న -
మూడు జోన్లుగా తిరుమల -
IPL 2025: రూ.26 కోట్ల ఆటగాడు ముంచితే.. రూ.2.6 కోట్ల కుర్రాడు గెలిపించాడు! -
ఈ రాశులకు అద్భుతం జరగబోతోంది -
నితీష్ కొత్త ఎత్తుగడ.. కేంద్రానికి బిగ్ షాక్! -
వాస్తు ప్రకారం ఇంటి ముఖ ద్వారం వద్ద ఈ తప్పులు అస్సలు చెయ్యొద్దు












Click it and Unblock the Notifications