తర్జనభర్జన: వార్ రూంకు 12 మంది మంత్రులు డుమ్మా
న్యూఢిల్లీ: కాంగ్రెసు అధిష్టానం ఏర్పాటు చేసిన సీమాంధ్ర నేతల సమావేశానికి 12 మంది రాష్ట్ర మంత్రులు డుమ్మా కొట్టారు. వీరిలో ఆరుగురిని పార్టీ అధిష్టానం ఆహ్వానించలేదని తెలుస్తోంది. పార్టీకి నష్టం కలిగించినవారిని సమావేశానికి ఆహ్వానించలేదని పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ సమావేశానికి ముందే చెప్పారు.
కాంగ్రెసు వార్ రూంలో మంగళవారం సాయంత్రం జరిగిన సమావేశానికి కేంద్ర మంత్రులు కావూరి సాంబశివరావు, జెడి శీలం, కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి హాజరయ్యారు. రాష్ట్రానికి చెందిన మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి, రఘువీరా రెడ్డి, డొక్కా మాణిక్య వరప్రసాద్, బాలరాజు, వట్టి వసంతకుమార్, బాలరాజు, సి. రామచంద్రయ్య, కన్నా లక్ష్మీనారాయణ, అహ్మదు్లలా, కొండ్రు మురళి హాజరయ్యారు.

ఎఐసిసి ప్రతినిధులు దిగ్విజయ్ సింగ్, జైరాం రమేష్, మోతీలాల్ ఓరావు, అహ్మద్ పటేల్ ఈ సమావేశానికి హాజరయ్యారు. రాష్ట్ర మంత్రులు శైలజానాథ్, ఏరాసు ప్రతాపరెడ్డి, టిజి వెంకటేష్, పితాని సత్యనారాయణ, తోట నర్సింహం, కాసు వెంకటకృష్ణా రెడ్డి, గల్లా అరుణ కుమారి, గంటా శ్రీనివాస రావు, శత్రుచర్ల విజయరామరాజు హాజరు కాలేదు.
ఆహ్వానం అందిన ఐదుగురు మంత్రులు కూడా సమావేశానికి డుమ్మా కొట్టారు. ఈ విషయంలో పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ మంత్రాంగం ఫలించలేదని తెలుస్తోంది. అయితే, తెలంగాణ నేతలు మాత్రం రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.
సీమాంధ్రకు ప్యాకేజీని మరింత పెంచాలని రాష్ట్ర మంత్రులు కాంగ్రెసు వార్ రూంలో రాష్ట్ర మంత్రులు కోరారు. జెడి శీలం ఓ నివేదికను అందించినట్లు సమాచారం. కాగా, రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలా, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలా అనే విషయంపై కూడా చర్చ జరిగినట్లు తెలుస్తోంది.
కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే శాసనసభ్యుల మద్దతు ఉంటుందా అనే విషయంపై అధిష్టానానికి అనుమానాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఏమైనా రేపటి వరకు రాష్ట్రంలో ప్రభుత్వ ఏర్పాటుపై స్పష్టత వచ్చే అవకాశాలున్నాయి.












Click it and Unblock the Notifications