బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

college girl: లయకు పవన్ కల్యాణ్ బావ, కాలేజ్ లోకి ఎలా వెళ్లాడంటే ?, హత్యకు ప్లాన్ ?

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: ఐటీ హబ్ బెంగళూరు నగరం శివార్లలోని రాజనకుంటేలోని ప్రెసిడెన్సీ కాలేజ్ లో లయస్మిత అలియాస్ లయా (19) అనే యువతి బీటెక్ చదువుతోంది. కోలారుకు చెందిన లయస్మిత సోమవారం ఉదయం కాలేజ్ కు వెళ్లింది. మద్యాహ్నం క్లాస్ రూమ్ లో నుంచి లయస్మిత స్నేహితులతో కలిసి బయటకు వచ్చింది. ఆ కాలేజీలోకి వెళ్లిన పవన్ కల్యాణ్ క్లాస్ రూమ్ సమీపంలో నిలబడి ఉన్న లయస్మితి బయటకి లాక్కొనివచ్చి ఆమెను 10 సార్లకంటే ఎక్కువ సార్లు కత్తితో పొడిచేయడంతో ఆమె చనిపోయింది. వేరే కాలేజ్ లో చదివే పవన్ కల్యాణ్ ఆ కాలేజ్ లోకి ఎలా వెళ్లాడు ? అని పోలీసులు ఆరా తీస్తే దిమ్మతిరిగిపోయే విషయం బయటకు వచ్చింది.

Wife: లవ్ మ్యారేజ్, భార్యకు దిక్కులేనంతమంది బాయ్ ఫ్రెండ్స్, ఎదురు కట్నాలు, మేడమ్ మొబైల్ లో ?Wife: లవ్ మ్యారేజ్, భార్యకు దిక్కులేనంతమంది బాయ్ ఫ్రెండ్స్, ఎదురు కట్నాలు, మేడమ్ మొబైల్ లో ?

 అమ్మాయికి బావ

అమ్మాయికి బావ

లయస్మితన పొడిచి చంపేసిన పవన్ కల్యాణ్ కూడా అదే కత్తితో అతని కడుపులో పొడుచుకోవడంతో కుప్పకూలిపోయాడు. పవన్ కళ్యాణ్ వేరే కాలేజీలో బీసీఏ చదివాడని, ప్రేమ విచారణలో లయస్మితకు, పవన్ కల్యాణ్ కు గొడవ జరిగగడంతో చివరికి లయస్మిత హత్యకు గురి అయ్యే వరకు వెళ్లిందని పోలీసులు అన్నారు. కోలారు జిల్లా మళబాగిలుకు చెందిన లయస్మితకు పవన్ కల్యాణ్ చాలా దగ్గర బంధువు అని, ఆమెకు అతను బావ అవుతాడని, ఇద్దరూ బెంగళూరులో వేర్వేరు కాలేజీల్లో చదువుతున్నారని పోలీసులు చెప్పారు.

 వాట్సాప్ డీపీలో మరదలి ఫోటో

వాట్సాప్ డీపీలో మరదలి ఫోటో

పవన్ కల్యాణ్ వరసకు మరదలు అయ్యే సుస్మితా ఫోటోను అతని వాట్సాప్ నెంబర్ డీపీలో పెట్టుకున్నాడు. లయస్మిత బంధువు ఒకరు ఆ విషయం గమనించి లయస్మిత తల్లికి చెప్పాడు. లయస్మితను ఆమె తల్లి ఏమిటిది అని ప్రశ్నించింది. తాను పవన్ కల్యాణ్ తో మాట్లాడుతున్నానని, తాను అతన్ని ప్రేమించడం లేదని లయస్మిత తల్లికి చెప్పింది,

 ఫోన్ నెంబర్ బ్లాక్ చేసిన లయస్మిత

ఫోన్ నెంబర్ బ్లాక్ చేసిన లయస్మిత

ఎందుకు వచ్చిన రామాయణం అని అనుకున్న లయస్మిత పవన్ కల్యాణ్ ఫోన్ నెంబర్ బ్లాక్ లిస్ట్ లో పెట్టిందని, తరువాత ఆమె మీద పవన్ కల్యాణ్ రగిలిపోయాడని కుటుంబ సభ్యులు అంటున్నారు. అప్పుడప్పుడు పవన్ కల్యాణ్ ను బెంగళూరులో కలుస్తున్న లయస్మితం తరువాత అతనితో మాట్లాడటం కూడామానేసిందని పోలీసుల విచారణలో వెలుగు చూసింది.

 కాలేజ్ లోకి ఎలా వెళ్లాడంటే ?

కాలేజ్ లోకి ఎలా వెళ్లాడంటే ?

బెంగుళూరులో కాలేజీ విద్యార్థులను దిగ్భ్రాంతికి గురిచేసిన ప్రెసిడెన్సీ యూనివర్సిటీలో విద్యార్థిని లయస్మిత హత్య కేసులో ఓ ట్విస్ట్ వెలుగు చూసింది. కాలేజీ క్యాంపస్ ఆవరణలోకి బయటి వ్యక్తుల ప్రవేశం నిషేదం ఉన్నప్పటికి అదే కాలేజ్ లో చదువుతున్న మరో విద్యార్థి ఐడీ కార్డు పవన్ కల్యాణ్ కు ఇచ్చి అతన్ని కాలేజీలోకి ప్రవేశించేందుకు హంతకుడికి సహకరించినట్లు పోలీసులు విచారణలో వెలుగు చూసింది.

 ఐడీ కార్డు ఇచ్చింది ఎవరు ? సీసీటీవీల్లో

ఐడీ కార్డు ఇచ్చింది ఎవరు ? సీసీటీవీల్లో

నిందితుడు పవన్‌కల్యాణ్‌కు కాలేజీలోకి వెళ్లేందుకు ఐడీ కార్డు ఎవరు ఇచ్చారు ? అనేదానిపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఇందుకు సంబంధించి కళాశాలలోని సీసీటీవీ ఫుటేజీలో నిందితుల కదలికలను పరిశీలిస్తున్నారు. అంతేకాకుండా సెక్యూరిటీ గార్డు, కాలేజీ మేనేజ్‌మెంట్, అక్కడి సిబ్బందిని రాజనకుంటే పోలీసులు విచారిస్తున్నారు. మృతురాలు లయస్మిత తల్లి రాజానుకుంట పోలీస్ స్టేషన్‌లో కేసు పెట్టడంతో పోలీసులు విచారణ చేస్తున్నారు.

English summary
Twist in the engineering college girl's murder case, Pawan Kalyan went in with the same college boy's ID card near Bengaluru.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X