Twitter: అనూహ్య నిర్ణయం -భారత్‌లో గ్రీవెన్స్ అధికారిగా అమెరికన్ జెరెమీ కెసెల్ -కొత్త ఐటీ రూల్స్‌కు విరుద్ధం

భారత ప్రభుత్వంతో విభేదాలను మరింత పెద్దవి చేస్తూ ప్రఖ్యాత మైక్రోబ్లాగింగ్ సంస్థ ట్విటర్ అనూహ్య నిర్ణయం తీసుకుంది. మోదీ సర్కార్ తీసుకొచ్చిన కొత్త ఐటీ చట్టాల అమలు విషయంలో వివాదాస్పదంగా వ్యవహరిస్తోన్న ట్విటర్.. మరోసారి నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించింది. ఇండియాలో గ్రీవెన్స్ అధికారిగా ఓ అమెరికన్ ను నియమించడం ద్వారా ట్విటర్ తలబిరుసును ప్రదర్శించింది.

కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త ఐటీ నిబంధనల ప్రకారం యూజర్ల సంఖ్య 50 లక్షలుదాటితే సోషల్ మీడియా సంస్థలు ఫిర్యాదుల పరిష్కారానికి ఓ అధికారిని నియమించి, ఆ వివరాలను వెల్లడించాల్సి ఉంటుంది. అంతే కాకుండా ఆ అధికారి తప్పనిసరిగా ఇండియాలో నివాసం ఉండే వ్యక్తై ఉండాలి. కానీ ట్విట్టర్ తీసుకున్న తాజా నిర్ణయం ఈ నిబంధనకు పూర్తి వ్యతిరేకంగా ఉంది.

Twitter appoints American Jeremy Kessel as new grievance officer for India, Contempt of new IT Rules

అమెరికాకు చెందిన జెరెమీ కెసెల్ అనే ఉద్యోగిని ఇండియాలో గ్రీవెన్స్ అధికారిగా ట్విట్టర్ నియమించింది. ప్రస్తుతం కాలిఫోర్నియాలోని కార్యాలయంలో పనిచేస్తోన్ జెరెమీ ట్విటర్ గ్లోబ‌ల్ లీగ‌ల్ పాల‌సీ డైరెక్ట‌ర్‌గా ఉన్నారు. కాగా, ట్విటర్ ఇండియా గ్రీవెన్స్ అధికారికిగా అమెరికన్ ను నియమించడంతో ఈ నియామకాన్ని భారత ప్రభుత్వం అంగీకరించలేదు.

కేంద్రం, ట్విటర్ మధ్య కొంత కాలంగా విభేదాలు తారాస్థాయికి చేరిన దరిమిలా ట్విటర్ ఇండియా తాత్కాలిక గ్రీవెన్స్ అధికారిగా ఉన్న ధర్మేంద్ర చతుర్ ఆదివారం రాజీనామా చేయడం కూడా సంచలనంగా మారింది. బాధ్యతలు తీసుకుని నెల కూడా తిరక్క ముందే ధర్మేంద్ర రాజీనామా చేయడంతో ఆయన స్థానంలో జెరెమీ కెసెల్ కు ఇండియాలో గ్రీవెన్స్ అధికారిగా బాధ్యతలు అప్పగించారు.

ట్విటర్‌ వంటి దిగ్గజ సంస్థలు గ్రీవెన్స్ అధికారితోపాటు ఓ నోడల్‌ అధికారి, స్థానిక ఫిర్యాదుల అధికారిని కూడా నియమించాలసి ఉంటుంది. ఈ అధికారులంతా భారత్‌లో నివసించేవారై ఉండాలి. దీనికి విరుద్ధంగా అమెరికా ఉద్యోగిని నియమించడంతో కేంద్ర ప్రభుత్వం, ట్విట్టర్ మధ్య మరోసారి వివాదం తలెత్తనున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే, జమ్మూకాశ్మీర్, లదాక్ లను వేరే దేశాలుగా పేర్కొంటూ ట్విటర్ సంస్థ తాజాగా ప్రచురించిన ఇండియా మ్యాప్ ఉదంతంపైనా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+